Jio 5G Rolling Out : రిలయన్స్ జియో 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G ప్లాన్లు ఉన్నాయంటే? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Jio 5G Rolling Out : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రస్తుతం 2023 చివరి నాటికి పాన్ ఇండియా అంతటా 5G నెట్‌వర్క్‌ని విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైన జియో ట్రూ 5G లాంచ్ అయిన 4 నెలల్లోనే భారత్‌లో దాదాపు 200 నగరాలకు చేరుకుంది.

Jio 5G Rolling Out : రిలయన్స్ జియో 5G సర్వీసులు.. ఏయే నగరాల్లో 5G ప్లాన్లు ఉన్నాయంటే? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Jio 5G Rolling Out _ List of cities, how to activate, 5G plans and everything else you should know

Jio 5G Rolling Out : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రస్తుతం 2023 చివరి నాటికి పాన్ ఇండియా అంతటా 5G నెట్‌వర్క్‌ని విస్తరిస్తోంది. అక్టోబర్ 2022లో ప్రారంభమైన జియో ట్రూ 5G లాంచ్ అయిన 4 నెలల్లోనే భారత్‌లో దాదాపు 200 నగరాలకు చేరుకుంది. రాబోయే రోజుల్లో టెల్కో మరిన్ని నగరాల్లో అందుబాటులోకి రానుంది. ఇటీవలి విస్తరణలో, అరుణాచల్ ప్రదేశ్ (ఇటానగర్), మణిపూర్ (ఇంఫాల్), మేఘాలయ (షిల్లాంగ్), మిజోరం (ఐజ్వాల్), నాగాలాండ్ (కోహిమా, దిమాపూర్), త్రిపుర (అగర్తల)లోని 7 నగరాల్లో జియో 5G సర్వీసులను ప్రకటించింది. Jio వెల్‌కమ్ ఆఫర్‌ను పొందిన జియో యూజర్లు వేగవంతమైన 5వ జనరేషన్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవచ్చు. దీంతో Jio 5G నెట్‌వర్క్ ప్రస్తుతం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 192 నగరాల్లో అందుబాటులో ఉంది. దేశంలో అందుబాటులో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో Jio 5G సర్వీసులకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Jio 5G నగరాలు పూర్తి జాబితా ఇదే :
Andhra Pradesh, Chittoor, Eluru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Narasaraopet, Nellore, Ongole, Rajamahendravaram, Srikakulam, Tirumala, Tirupati, Vijayawada, Visakhapatnam, Vizianagaram అరుణాచల్ ప్రదేశ్- ఇటానగర్, అస్సాం- గౌహతి, నాగోన్, సిల్చార్, బీహార్, ముజఫర్‌పూర్, పాట్నా, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్- భిలాయ్, బిలాస్‌పూర్, దుర్గ్, కోర్బా, రాయ్‌పూర్, రాజ్‌నంద్‌గావ్, గోవా – పనాజీ, ఢిల్లీ, గుజరాత్- అహ్మదాబాద్, అహ్వా, అమ్రేలి, ఆనంద్, భరూచ్, భావ్‌నగర్, భుజ్, బొటాడ్, ఛోటా ఉదయపూర్, దాహోద్, గోద్రా, హిమత్‌నగర్, జామ్‌నగర్, జునాగఢ్, కలోల్, ఖంబలియా, లునావాడ, మెహసానా, మోడోసా, మోర్బి, నడియాద్, నవసారి, పటాన్‌పూర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, రాజ్‌పిప్లా, సూరత్, వడోదర, వల్సాద్, వెరావల్, వ్యారా, వాధ్వన్. జార్ఖండ్- ధన్‌బాద్, జంషెడ్‌పూర్, రాంచీ, హర్యానా- అంబాలా, బహదూర్‌ఘర్, ఫరీదాబాద్, గురుగ్రామ్, హిసార్, కర్నాల్, పంచకుల, పానిపట్, రోహతక్, సిర్సా, సోనిపట్.

కర్ణాటక- బాగల్‌కోట్, బెల్గాం, బళ్లారి, బెంగళూరు, బీదర్, బీజాపూర్, చిక్కమగళూరు, దావణగెరె, గడగ్-బెటగేరి, హాసన్, హోస్పేట్, హుబ్లీ-ధార్వాడ్, కలబురగి, మాండ్య, మంగళూరు, మణిపాల్, మైసూరు, శివమొగ్గ, తుమకూరు, ఉడుపి. కేరళ- అలప్పుజ, చెర్తల, గురువాయూర్ టెంపుల్, కన్నూర్, కొచ్చి, కొల్లం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిసూర్, త్రివేండ్రం. మధ్యప్రదేశ్- భోపాల్, గ్వాలియర్, ఇండోర్, జబల్పూర్, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, శ్రీ మహాకాల్ మహాలోక్, ఉజ్జయిని, మహారాష్ట్ర- అహ్మద్‌నగర్, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, ముంబై, నాగ్‌పూర్, నాందేడ్-వాఘలా, నాసిక్, పూణే, సాంగ్లీ, షోలాపూర్, మణిపూర్- ఇంఫాల్, మేఘాలయ- షిల్లాంగ్, మిజోరం- ఐజ్వాల్, నాగాలాండ్- ద్మాపూర్, కోహిమా, ఒడిశా- బాలాసోర్, బరిపడ, భద్రక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, కటక్, జార్సుగూడ, పూరి, రూర్కెలా, సంబల్పూర్.

Jio 5G Rolling Out _ List of cities, how to activate, 5G plans and everything else you should know

Jio 5G Rolling Out _ List of cities, how to activate, 5G plans and everything else

Read Also : Best Jio Plans in 2023 : 2023లో బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇదిగో ఫుల్ లిస్టు..!

పుదుచ్చేరి పంజాబ్- అమృత్‌సర్, డేరాబస్సీ, ఖరార్, లూథియానా, మొహాలి, జిరాక్‌పూర్, రాజస్థాన్- బికనీర్, జైపూర్, జోధ్‌పూర్, కోట, నాథ్‌ద్వారా, ఉదయపూర్, తమిళనాడు- చెన్నై, కోయంబత్తూరు, ధర్మపురి, ఈరోడ్, హోసూర్, మధురై, సేలం, తూత్తుకుడి, తిరుచిరాపల్లి, తిరుప్పూర్, వెల్లూరు, Telangana- Hyderabad, Karimnagar, Khammam, Nalgonda, Nizamabad, Warangal, త్రిపుర- అగర్తల, ఉత్తరాఖండ్- డెహ్రాడూన్, Uttar Pradesh- Agra, Aligarh, Bareilly, Ghaziabad, Jhansi, Kanpur, Lucknow, Meerut, Moradabad, Noida, Prayagraj, Saharanpur and Varanasi, పశ్చిమ బెంగాల్- అసన్సోల్, దుర్గాపూర్, కోల్‌కతా, సిలిగురి.

Jio 5Gని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
రిలయన్స్ జియో (Jio 5G)ని యాక్టివేట్ చేసేందుకు మీరు జియో వెల్‌కమ్ ఆహ్వానాన్ని అందుకున్నారని, 5G-రెడీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. అదనంగా, మీరు Jio 5Gకి సపోర్ట్‌తో కూడిన సరికొత్త సిస్టమ్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిస్టమ్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు మీ ఫోన్ Settings> About Phone> System Update వెళ్లి, డౌన్‌లోడ్ Latest అప్‌డేట్‌పై Tap చేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో Jio 5Gని యాక్టివేట్ చేయండి :
* ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
* ‘మొబైల్ నెట్‌వర్క్’పై Tap చేయండి.
* జియో SIMని ఎంచుకుని, ఆపై ‘Preferred network type’ ఆప్షన్‌పై Tap చేయండి.
* ఇప్పుడు 5Gని ఎంచుకోండి.
* iPhoneలో Jio 5Gని యాక్టివేట్ చేయండి.

Settings సెక్షన్ ఓపెన్ చేయండి.
ఆపై ‘Mobile Data’ ఎంచుకోండి.
* ఇప్పుడు ‘Voice And Data’కి వెళ్లండి.
* Jio 5Gకి కనెక్ట్ చేసేందుకు 5G AUTO, ‘5G స్టాండలోన్ ఆన్’ ఎంచుకోండి.
* Jio 5G వెల్‌కమ్ ఆఫర్

Jio వెల్‌కమ్ ఆధారంగా 5Gని అందిస్తోంది. అందరూ Jio True 5Gని ఉపయోగించలేరు. జియో వెల్‌కమ్ ఆఫర్‌ని పొందిన యూజర్లు కొత్త, వేగవంతమైన నెట్‌వర్క్ కనెక్టివిటీని ఉపయోగించవచ్చు. Jio వెల్‌కమ్ ఆఫర్ కింద, టెల్కో మీ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. వ్యాలిడిటీ అయ్యే యాక్టివ్ బేస్ ప్లాన్ రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నంత వరకు మాత్రమే అన్‌లిమిటెడ్ 5G డేటా పని చేస్తుంది. ముఖ్యంగా, 5G నెట్‌వర్క్ మీ ప్రస్తుత 4G SIMతో ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది. మీరు కొత్త 5G SIM కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.

జియో వెల్‌కమ్ ఆఫర్‌ను ఎలా పొందాలంటే? :
మీరు My Jio యాప్‌లో Jio వెల్‌కమ్ ఆఫర్ కోసం చెక్ చేయవచ్చు. Jio SMS ద్వారా లేదా WhatsApp మెసేజ్ ద్వారా వెల్‌కమ్ నోటిఫికేషన్‌ను కూడా పంపుతుంది.

జియో 5G ప్లాన్లు :
Jio 5Gని పొందడానికి రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్‌ పొందవచ్చు. రూ. 239 యాక్టివ్ ప్లాన్ లేని యూజర్ల కోసం Jio రూ. 61 యాడ్-ఆన్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను కలిగి ఉంది. జియో యూజర్లు 5G-సపోర్టెడ్ నగరాల్లో లేటెస్ట్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేసేందుకు రూ. 61 ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 6GB డేటా కూడా ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త ప్లాన్లు ఇవే.. 2.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. ఏ ప్లాన్ ధర ఎంతంటే?