India Covid : కరోనా మనల్ని వదలదా ? ఫోర్త్ వేవ్‌‌కు సంకేతం!

మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్‌ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్‌, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్‌ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా...

India Covid : కరోనా మనల్ని వదలదా ? ఫోర్త్ వేవ్‌‌కు సంకేతం!

COVID-19 UPDATE

Covid Cases In India : కరోనా ఇక మనల్ని వదలదా..? అవును..! వదలదు..! వదలనే వదలదు..! గత వారం రెండు రెట్లు పెరిగిన కరోనా కేసులే అందుకు నిదర్శనం..! రోజురోజుకు పెరుగుతున్న కేసులే కరోనా ఫోర్త్‌ వేవ్‌కు సంకేతం. ప్రతిసారి కేసులు తగ్గుతున్నాయని హ్యాపీగా ఫీల్‌ అయ్యేలోపే కేసులు పెరుగుతుంటాయి. హమ్మయ్య అనుకునేలోపే వామ్మో అనుకునేలా చేస్తుంది కరోనా. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యం 2వేలకు పైగా కేసులు పెరుగుతుండడం కలవరపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజులుగా రోజుకు వెయ్యికు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయి. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.6 శాతం దాటింది. రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది.

Read More : Brazil carnival : కరోనా తరువాత అత్యంత వైభవంగా బ్రెజిల్ లో కార్నివాల్ సందడి..

మరోవైపు CBSE 10, 12వ తరగతుల ఫైనల్ ఎగ్జామ్స్‌ మొదలవనున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్‌, కాలేజీల్లో కేసులు పెరుగుతుండడం.. పరీక్షలు స్టార్ట్‌ అవుతుండడంతో కరోనా మరింత విజృంభిస్తుందేమోనన్న భయాలు సర్వత్రా నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా గతవారంలో పాజిటివ్‌ కేసులు రెండు రెట్లు పెరిగాయి. 12రాష్ట్రాల్లో కరోనా గ్రాఫ్ పెరిగింది. ఈ ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా 15వేల 700 కేసులు నమోదయ్యాయి. అంతకముందు వారంలో దీని సంఖ్య కేవలం 8వేలుగా ఉంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లు వైరస్‌ వర్రీస్‌తో కాలం వెళ్లదీస్తున్నాయి. ఢిల్లీలో ఈ ఏడు రోజుల్లో 6వేల 326 కేసులు నమోదయ్యాయి. అంతకముందు వారంతో పోల్చితే ఇది 2.7రెట్లు ఎక్కువ. అటు హర్యానాలో గతవారంలో 2 వేల 296, ఉత్తర ప్రదేశ్‌లో 12 వందల 78 కేసులు రికార్డయ్యాయి.

Read More : Corona Cases : భారత్ లో మళ్లీ కరోనా పంజా.. కొత్తగా ఎన్ని కేసులంటే!

అంతకముందు వారంతో పోల్చితే ఇది రెండు రెట్లు ఎక్కువ. ఓవరాల్‌గా గత వారం కేసుల్లో 75శాతం కేసులు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ నుంచే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ ప్రతిసారి ఇలా ఉత్తర భారతంలో మొదట వేగంగా వ్యాపించి.. ఆ తర్వాత మహారాష్ట్రతో పాటు దక్షిణ రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకల్లో విజృంభిస్తోంది. గతేడాది సెకండ్‌వేవ్‌, ఈ ఏడాది జనవరిలో వచ్చిన థర్డ్‌వేవ్‌లోనూ ఇదే జరిగింది. మరోసారీ ఇదే రిపీట్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ మరోసారి కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఎల్లుండి ఈ సమావేశం ఉంటుంది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ముఖ్యమంత్రులతో సమావేశమౌతారు. కరోనా తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా.. కేసుల కట్టడిచర్యలను తీసుకునే దిశగా ఆదేశాలను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.