Jaitra : కడపజిల్లా రైతు కథ ‘జైత్ర’ సినిమా.. అగ్రికల్చర్ సైటిస్ట్తో రైతు ప్రేమ!
టాలీవుడ్ లో పల్లెటూరి మట్టి కథలకు డిమాండ్ పెరిగిపోతుంది. తాజాగా అటువంటి ఒక పల్లెటూరి మట్టి కథతోనే వచ్చిన సినిమా 'జైత్ర'. అగ్రికల్చర్ సైటిస్ట్తో రైతు ప్రేమని..

Kadapa farmer story Jaitra movie is now in theaters
Jaitra : ఇటీవల పల్లెటూరి మట్టి కథలు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. దీంతో స్టార్ నిర్మాతలు సైతం అటువంటి సినిమాలను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. స్టార్ హీరోలు కూడా అటువంటి మట్టి కథల్లో నటించేందుకు రెడీ అంటున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ‘బలగం’ వంటి కథని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి సక్సెస్ అయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా RC16 కూడా ఒక పల్లెటూరి మట్టి కథతోనే రాబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
Raviteja : ఇంకా ఆగని ధమాకా సినిమా రికార్డుల దూకుడు.. పల్సర్ బైక్ సాంగ్!
తాజాగా టాలీవుడ్ అలాంటి ఒక పల్లెటూరి కథ ‘జైత్ర’ అనే సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక నిత్యం కరువుని ఎదురుకొని వ్యవసాయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్న రాయలసీమ ప్రాంతంలోని కడపజిల్లా రైతు కథ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. అగ్రికల్చర్ సైటిస్ట్ అయిన హీరోయిన్ రాయలసీమ వ్యవసాయ పరిస్థితి గురించి తెలుసుకునేందుకు హీరో దగ్గరకి రావడం. వారి ఇద్దరి మధ్య పరిచయం, సన్నివేశాలు ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.
NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి కానుక.. సూపర్ హిట్ అడవి రాముడు రీ రిలీజ్ ఆ రోజే..
భూమి, పశువులు పై ప్రేమ చూపించే హీరో పై హీరోయిన్ కి ప్రేమ కలగడం వంటి సీన్స్ ఫీల్ గుడ్ గా ఉంటాయి. అలాగే రాయలసీమ అంటే కొడవళ్ళతో తలలు నరికే వంటి సన్నివేశాలు కాకుండా.. ఆ ప్రాంత పల్లెలో ముస్లిమ్స్ మరియు హిందువులు మామా మామా అని ఆప్యాయంగా పిలుచుకునే విషయాలు దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంతో నేటివిటీని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. కడపజిల్లా సంస్కృతి, యాస, సంప్రదాయాలు, రైతు కష్టాలు,కన్నీళ్లను ఎక్కడా బోర్ కొట్టకుండా కమర్షియల్ గా తెరకెక్కించారు. మల్లికార్జున్ తోట ఈ సినిమాని డైరెక్ట్ చేయగా సన్నీ నవీన్, రోహిణి రాచెల్ హీరోహీరోయిన్లుగా నటించారు. అల్లం సుభాష్ నిర్మించిన ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం అందించాడు.