Indian 2 : గండికోటలో భారతీయుడు.. వైరల్ అవుతున్న షూటింగ్ విజువల్స్..

ఉలగనాయగన్ కమల్ హాసన్ 'విక్రమ్' ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ గండికోటలో జరుగుతుంది. దీంతో కమల్ హాసన్ ని చూసేందుకు అభిమానులు గండికోట చేరుకున్నారు.

Indian 2 : గండికోటలో భారతీయుడు.. వైరల్ అవుతున్న షూటింగ్ విజువల్స్..

indian 2

Indian 2 : ఉలగనాయగన్ కమల్ హాసన్ ‘విక్రమ్’ ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సినిమాతో దాదాపు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాడు. ఈ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాదు కెరీర్ లో సాలిడ్ కమ్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇక ఇదే జోష్ లో.. తన కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్‌లా మిగిలిపోయిన భారతీయుడు సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీసుకు వస్తున్నాడు. 1996లో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ తీసుకు వద్దామని శంకర్ అప్పటి నుంచే అనుకుంటున్న అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది.

Indian 2: ఇండియన్-2 సినిమాలో స్టార్ క్రికెటర్ తండ్రి!

నిజానికి ఈ సినిమా విక్రమ్ కంటే ముందే విడుదల కావాల్సింది. కానీ బడ్జెట్ మరియు ఇతర కారణాల వల్ల ఈ మూవీ లేటు అవుతూ వచ్చింది. 2020లో సెట్ లో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల షూటింగ్ దాదాపు రెండేళ్లు నిలిచిపోయింది. విక్రమ్ సక్సెస్ తరువాత ఈ సినిమా మళ్ళీ పట్టాలు ఎక్కింది. ఇక శంకర్ అయితే కొన్ని రోజులు RC15 షూటింగ్ చేస్తూ, కొన్ని రోజులు ఇండియన్-2 చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా గండికోటలో జరుగుతుంది. దీంతో కమల్ హాసన్ ని చూసేందుకు అభిమానులు గండికోట చేరుకున్నారు. వచ్చిన అభిమానులను కమల్ హాసన్ కలిసి మాట్లాడాడు.

అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ హీరో సుదీప్, తమిళ హీరో సిద్దార్ద్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.