Kamal Khan : బాహుబలిని మించిన సినిమా తీస్తాను

తాజాగా బాహుబలి సినిమాని మించిన సినిమా తీస్తానంటూ KRK సవాలు చేశాడు. గతంలో 2008లో కమల్ ఖాన్ హీరోగా నటించిన ‘దేశద్రోహి’ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికి ఈ సినిమాపై, ఇందులో కేఆర్‌కే.....

Kamal Khan : బాహుబలిని మించిన సినిమా తీస్తాను

Krk

Kamal Khan :  ఇటీవల సౌత్ సినిమాలు చూసి బాలీవుడ్ కుళ్ళుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయాలు సాధిస్తున్నాయి. దీంతో బాలీవుడ్ లో కొంతమంది దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సౌత్ సినిమాల సక్సెస్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలంటి వారిలో కమల్ ఆర్ ఖాన్ ఒకరు.

బాలీవుడ్ నటుడు, నిర్మాత, క్రిటిక్ అయిన కమల్ ఖాన్ ఎప్పుడూ సౌత్, తెలుగు సినిమాలపైనా విమర్శలు చేస్తూనే ఉంటాడు. కమల్ ఖాన్ గతంలో దేశం మొత్తం మెచ్చిన ‘బాహుబలి’ సినిమాపై నెగిటివ్ గానే రివ్యూ ఇచ్చాడు. ఆ సినిమాపై విమర్శలు గుప్పించాడు. ఇటీవల వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజిఎఫ్ 2’ సినిమాలపై కూడా తన విషం కక్కాడు. ఆ సినిమాలని విమర్శిస్తూ వరుస ట్వీట్స్ చేశాడు.

తాజాగా బాహుబలి సినిమాని మించిన సినిమా తీస్తానంటూ KRK సవాలు చేశాడు. గతంలో 2008లో కమల్ ఖాన్ హీరోగా నటించిన ‘దేశద్రోహి’ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికి ఈ సినిమాపై, ఇందులో కేఆర్‌కే నటనపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు దీనికి పార్ట్ 2 అంటూ పోస్టర్ రిలీజ్ చేసి దీనిని బాహుబలి కంటే పెద్దగా నిర్మిస్తున్నానని తెలిపాడు. దీంతో అతని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశద్రోహి పార్ట్ 2 పోస్టర్ కూడా రిలీజ్ చేసి షూట్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని పోస్ట్ చేశాడు.

RGV : నా డేంజరస్ సినిమాని కుట్ర పన్ని ఆపారు

ఇక ఈ పోస్టర్ చూసి, బాహుబలి కంటే పెద్ద సినిమా అని ఇతను చేసిన కామెంట్స్ ని ప్రభాస్, రాజమౌళి అభిమానాలు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా చూసి బాలీవుడ్ లో సినిమాలు తీయడం నన్ను చూసి నేర్చుకోవాలని కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ పై బాలీవుడ్ లో కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. మరి ఈ సారి కమల్ ఖాన్ బాహుబలి కంటే పెద్ద సినిమా అని ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి.