Kangana Ranaut : యోగిని కలిసిన బాలీవుడ్ క్వీన్.. మహారాజ్ జీ అంటూ పోస్ట్..

ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించినందుకు సీఎం యోగికి అభినందనలు తెలపడానికి కలిసినట్లు సమాచారం. కంగనా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసి..........

Kangana Ranaut : యోగిని కలిసిన బాలీవుడ్ క్వీన్.. మహారాజ్ జీ అంటూ పోస్ట్..

Yogi

Updated On : May 2, 2022 / 12:58 PM IST

Kangana Ranaut :  బాలీవుడ్‌ క్వీన్, ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. ఏ అంశంపైనైనా, ఎవరిపైనైనా భయం లేకుండా మాట్లాడుతుంది. ఇక బాలీవుడ్ మాఫియా అంటూ ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం సినిమాలతో, లాకప్ షోతో బిజీగా ఉంది. తాజాగా కంగనా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని కలిసింది. ఈ మేరకు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మహారాజ్ జీ అంటూ స్పెషల్ పోస్ట్ చేసింది.

Vishwaksen : నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసిన హీరో విశ్వక్సేన్

కంగనా బీజేపీకి, భారతీయ సనాతన ధర్మం గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందని అందరికి తెలిసిందే. ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించినందుకు సీఎం యోగికి అభినందనలు తెలపడానికి కలిసినట్లు సమాచారం. కంగనా తన ఇన్‌స్టాలో ఫోటోలు షేర్ చేసి.. ”ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించిన తర్వాత మహారాజ్ యోగి ఆదిత్యనాథ్ జీని కలుసుకునే గొప్ప అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇది ఒక అద్భుతమైన సాయంత్రం. మహారాజ్ జీ యొక్క ఆశీస్సులు తీసుకున్నాను. ఆయనని చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను” అంటూ పోస్ట్ చేసింది. గతంలో కూడా కంగనా యోగిని కలిసింది. ప్రస్తుతం కంగనా, యోగి సమావేశం వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)