Kabzaa Trailer : కబ్జ ట్రైలర్ రిలీజ్.. కథా వేరేమో.. టేకింగ్ మాత్రం అచ్చం KGF.. సినీ పరిశ్రమలో మరో KGF కానుందా??

తాజాగా కబ్జ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్లు చూస్తుంటే KGF లాంటి సినిమా అనిపిస్తుంది అందరికి. ఇక ట్రైలర్ చూశాక కూడా అదే ఫీల్ వస్తుంది. కథ వేరైనా టేకింగ్, మేకింగ్ మాత్రం ఆల్మోస్ట్.....................

Kabzaa Trailer : కబ్జ ట్రైలర్ రిలీజ్.. కథా వేరేమో.. టేకింగ్ మాత్రం అచ్చం KGF.. సినీ పరిశ్రమలో మరో KGF కానుందా??

Kannada star heros Upendra and sudeep movie Kabzaa Trailer Released and trending in youtube

Kabzaa Trailer :  KGF సినిమా తర్వాత కన్నడ సినిమా పరిశ్రమలో భారీ సినిమాలు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు కలిసి కబ్జ సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ చంద్రు కబ్జ సినిమాని డైరెక్ట్ చేశాడు. కబ్జ సినిమా మార్చ్ 17న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

తాజాగా కబ్జ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్లు చూస్తుంటే KGF లాంటి సినిమా అనిపిస్తుంది అందరికి. ఇక ట్రైలర్ చూశాక కూడా అదే ఫీల్ వస్తుంది. కథ వేరైనా టేకింగ్, మేకింగ్ మాత్రం ఆల్మోస్ట్ KGF గుర్తొచ్చేలానే చేశారు. ఆ కలర్స్, సెట్స్, బ్యాక్ గ్రౌండ్ అంతా KGFనే గుర్తు చేస్తాయి.

ఇక ట్రైలర్ లో.. ఇది స్వతంత్రం ముందు 1945లో జరిగిన కథ అని తెలుస్తుంది. ట్రైలర్ లో ఎక్కువగా ఎలివేషన్ షాట్స్ చూపించారు. కథ ఏంటో తెలియకుండా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ చూస్తే సుదీప్ పోలీసాఫీసర్, ఉపేంద్ర పోలీస్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగినట్టు తెలుస్తుంది. చరిత్ర తెగిపడిన తలల గురించి కంటే ఆ తలలని తీసిన చేతుల్నే పొగుడుతుంది. అలాంటి ఒక చెయ్యి సృష్టించిన కథే కబ్జ అంటూ ట్రైలర్ ని నడిపించారు. ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. కోట శ్రీనివాసరావు చాలా రోజుల తర్వాత సినిమాల్లో కనపడటమే కాక మళ్ళీ ఒక పవర్ ఫుల్ పాత్ర చేసినట్టు తెలుస్తుంది.

Manoj-Mounika : భూమా దంపతులకు నివాళులు అర్పించనున్న మనోజ్, మౌనిక.. భారీ కాన్వాయ్‌తో ఆళ్లగడ్డకు పయనం..

ప్రస్తుతం కబ్జ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరోలు నటిస్తుండటంతో, భారీ సినిమా కావడంతో కన్నడ సినీ పరిశ్రమతో పాటు దేశమంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా KGF ని మరిపించేలా ప్రేక్షకులని మెప్పిస్తుందేమో చూడాలి.