Karan Johar : పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్2 సినిమాలు బాలీవుడ్ ని కప్పేశాయి..

తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరోసారి సౌత్ సినిమాలపై కామెంట్స్ చేశాడు. ఓ పక్కన వరుసగా సౌత్ సినిమాలలో భాగమవుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ................

Karan Johar : పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్2 సినిమాలు బాలీవుడ్ ని కప్పేశాయి..

Karan Johar

Karan Johar :  వరుసగా టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయం సాధించి వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్2 సినిమాలు రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ కి కూడా సరయిన విజయం లేకపోవడంతో సౌత్ సినిమాల ఎఫెక్ట్ ఇంకా బాలీవుడ్ లో కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఎవరో ఒక సెలబ్రిటీ రోజూ సౌత్ సినిమాలపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

Fire Accident : రణబీర్ షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ మరోసారి సౌత్ సినిమాలపై కామెంట్స్ చేశాడు. ఓ పక్కన వరుసగా సౌత్ సినిమాలలో భాగమవుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ”ఈ రోజుల్లో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం చాలా కష్టం. అయినా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు విజయాలను ఇస్తున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ ఏడాది విడుదలైన ‘గంగూబాయి కాఠియావాడి’, ‘భూల్‌ భులయ్య 2’ సినిమాలు 100కోట్లకు పైగా కలెక్షన్లని సాధించాయి. జూన్‌లో విడుదలైన ‘జుగ్‌జుగ్‌జీయో’ కూడా మంచి విజయం సాధించింది. అయితే సౌత్ సినిమాల జోరుముందు హిందీ బ్లాక్‌బస్టర్‌లు ఎవరికీ కనబడట్లేదు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్2 సినిమాలు సాధించిన విజయాలు మన బాలీవుడ్‌ సినిమాలని కప్పేశాయి. త్వరలోనే ఆ పరిస్థితి మారుతుంది. హిందీ సూపర్‌స్టార్లు అయిన ఆమిర్‌ఖాన్‌, షారుక్‌, సల్మాన్‌, అక్షయ్‌ కుమార్‌ల సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ‘లాల్ సింగ్‌ చడ్డా’, బ్రహ్మాస్త్ర, రక్షాబంధన్‌.. లాంటి పెద్ద సినిమాలు విజయం సాధించి బాలీవుడ్‌ని మళ్లీ ట్రాక్ లో పెడతాయి” అని అన్నారు.