Brahmasthra : టార్గెట్ ‘బాహుబలి’.. రాజమౌళికి దీటుగా కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్రం’..

‘బ్రహ్మాస్త్ర’తో ‘బాహుబలి’ రికార్డ్‌ను తిరగరాసి.. ట్రిపుల్ ఆర్ కు సవాల్ విసరాలనేది నిర్మాత కరణ్ జోహార్ సంకల్పమనే టాక్ నడుస్తోంది..

Brahmasthra : టార్గెట్ ‘బాహుబలి’.. రాజమౌళికి దీటుగా కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్రం’..

Karan Johar To Break Baahubali Records

Brahmasthra: ‘బాహుబలి’ దెబ్బకు బాలీవుడ్ దర్శక నిర్మాతలకు నిద్రపట్టని మాట నిజం. ఇక అప్పటినుంచి టాలీవుడ్ సినిమాను బీట్ చేసేందుకు ఫుల్‌గా ట్రై చేస్తున్నారు. కరణ్ జోహార్ ఓ అడుగు ముందుకేసి రాజమౌళికి ధీటుగా ఓ ప్రాజెక్ట్‌తో ఇన్‌డైరెక్ట్‌గా సవాల్ చేస్తున్నాడు. రణ్ బీర్‌కి తోడుగా ఆ మూవీలో మన మన్మథుడండటం విశేషం. ఇంతకీ ఏంటా సినిమా.. ఎంతవరకు వచ్చింది?..

‘బాహుబలి’ రికార్డ్స్‌ను బద్దలు కొట్టేందుకు ‘బ్రహ్మాస్త్రా’న్ని వాడుతున్నాడు కరణ్ జోహార్. ‘బ్రహ్మాస్త్ర’ అనే మూవీని రెండు భాగాలుగా రెడీ చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్నారు.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ వంటివారు కీ రోల్స్ చేస్తున్నారు. 5వేల ఏళ్ల నాటి కథతో భారీ స్థాయి గ్రాఫిక్స్ విజువల్ వండర్‌గా ‘బ్రహ్మాస్త్ర’ ను తెరకెక్కిస్తున్నారు. లాస్ట్ ఇయర్ రావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యమైంది.

ప్రస్తుతం కేవలం ప్రీ ప్రమోషన్ కోసమే 13 టీజర్లను రెడీ చేశారట ‘బ్రహ్మాస్త్ర’ మేకర్స్. పాన్ ఇండియాను మించి అనే స్థాయిలో రూపొందుతున్న ‘బ్రహ్మాస్త్ర’తో ‘బాహుబలి’ రికార్డ్‌ను తిరగరాసి.. ట్రిపుల్ ఆర్ కు సవాల్ విసరాలనేది నిర్మాత కరణ్ జోహార్ సంకల్పమనే టాక్ నడుస్తోంది. అందుకే రణ్ బీర్ కపూర్ సైతం ఈ మూవీ కోసం లెక్కలేనని కాల్షీట్స్ అడ్జెస్ట్ చేసాడు. బాలీవుడ్ వదులుతోన్న ఈ ‘బ్రహ్మాస్త్రం’.. జక్కన్న స్టామినాను షేక్ చేస్తుందో, లేదో.. చూడాలి మరి..