Basavaraj Bommai : పెంపుడు కుక్కకి కర్ణాటక సీఎం కన్నీటి వీడ్కోలు

క‌ర్నాట‌క నూతన సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై..జంతు ప్రేమికులు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు.

Basavaraj Bommai : పెంపుడు కుక్కకి కర్ణాటక సీఎం కన్నీటి వీడ్కోలు

Bommai

Basavaraj Bommai  క‌ర్నాట‌క నూతన సీఎం బ‌స‌వ‌రాజు బొమ్మై..జంతు ప్రేమికులు అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కొనియాడుతున్నారు. తన పెంపుడు కుక్కకోసం బొమ్మై సహా కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జులై-12న బొమ్మై పెంపుడు కుక్క చనిపోయింది. పెంపుడు కుక్క మరణించడంతో బొమ్మై కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుక్క కళేబరానికి పూల దండలు వేసి.. అందరూ ఏడుస్తూ శోకసంద్రంలో మునిగిపోయారు. బొమ్మై, ఆయన భార్య, కూతురు కన్నీళ్లతో పెంపుడు కుక్కకు వీడ్కోలు పలికారు. తమ పెంపుడు కుక్క సన్నీ చనిపోయిందని.. తమ ఇంట్లో ఓ సభ్యుడు చనిపోయినట్లు ఉందని ఆ సమయంలో బొమ్మై ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. తామంతా విచారంగా ఉన్నట్లు తెలిపారు.

అయితే, ప్రస్తుతం ఆయన సీఎం అయిన తర్వాత మానవతావాది సీఎం బొమ్మై అంటూ నెటిజన్లు ఈ పాత వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా బొమ్మై జంతు ప్రేమికులు అంటూ కొనియాడుతున్నారు. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం మంచి విషయం అంటూ మెచ్చుకుంటున్నారు.