Karthi : పొన్నియిన్ సెల్వన్ 2 చూడటం కోసం జపాన్ నుంచి చెన్నైకి వచ్చిన కార్తీ ఫ్యాన్స్..

తాజాగా జపాన్ కార్తీ ఫ్యాన్స్ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని తమిళ్ ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో చూడటానికి జపాన్ నుంచి చెన్నై వచ్చి ఆశ్చర్యపరిచారు.

Karthi : పొన్నియిన్ సెల్వన్ 2 చూడటం కోసం జపాన్ నుంచి చెన్నైకి వచ్చిన కార్తీ ఫ్యాన్స్..

Karthi fans came from japan for watching ponniyin selvan

Karthi : మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, శోభిత, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, జయరాం.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) పార్ట్ 2 సినిమా ఇటీవల ఏప్రిల్ 28న పాన్ ఇండియా(Pan India) రిలీజయింది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉండటంతో ఆ స్టార్స్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. మన సినిమాలకు, స్టార్స్ కు బయట దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా జపాన్ కార్తీ ఫ్యాన్స్ పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని తమిళ్ ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో చూడటానికి జపాన్ నుంచి చెన్నై వచ్చి ఆశ్చర్యపరిచారు.

PS 2 Collections : నాలుగు రోజుల్లో 200 కోట్లు.. అయినా PS2 బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కావాలి..

తమిళ్ – జపాన్ కి చెందిన ఓ ఫ్యామిలీ కార్తీకి అభిమానులు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని ఇక్కడి థియేటర్ లో తమిళ్ ఆడియన్స్ తోనే కలిసి చూడాలని జపాన్ నుంచి చెన్నైకి వచ్చి ఈ సినిమాను చూశారు. ఏకంగా నాలుగు సార్లు పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాను థియేటర్స్ లో చూశారు. అలాగే వీరికి కార్తీని కలిసే ఛాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈ ఫ్యామిలీ కార్తీని అతని ఇంట్లోనే కలిశారు. కార్తీ వీరికి తన ఇంట్లోనే ఆతిథ్యం కూడా ఇచ్చాడు. కార్తీ కోసం తెచ్చిన బహుమతులు అతనికి అందచేశారు ఈ జపాన్ ఫ్యామిలీ. కార్తితో ఈ జపాన్ ఫ్యామిలీ దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి.