Jee Le Zaraa : ముగ్గురు హీరోయిన్స్‏తో మల్టీస్టారర్..

బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేశారు ఫర్హాన్ అక్తర్.. ఇప్పటి వరకూ వచ్చిన హీరో మల్టీస్టారర్ మూవీ ట్రెండ్‌ని హీరోయిన్స్‌కి యాడ్ చేస్తూ.. ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు..

Jee Le Zaraa : ముగ్గురు హీరోయిన్స్‏తో మల్టీస్టారర్..

Jee Le Zaraa: హీరోలు మల్టీస్టారర్ మూవీస్ చాలా సార్లు చేశారు. కానీ, హీరోయిన్ మల్టీస్టారర్స్ పెద్దగా రాలేదు. వచ్చినా.. అందరూ టాప్ రేంజ్‌లో ఉన్న హీరోయిన్లు ఉండరు. కానీ బాలీవుడ్‌లో ఆ ట్రెండ్ సెట్ చేస్తూ.. ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా లీడ్ రోల్స్‌లో ఒక క్రేజీ జర్నీ స్టార్ట్ అవ్వబోతోంది. మరి ఆ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసిందెవరో, ఎలా ఉండబోతోందో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ మూవీ అనౌన్స్ చేశారు ఫర్హాన్ అక్తర్. ఇప్పటి వరకూ వచ్చిన హీరో మల్టీస్టారర్ మూవీ ట్రెండ్‌ని హీరోయిన్స్‌కి యాడ్ చేస్తూ.. ఓ క్రేజీ మూవీ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఆలియా భట్, కత్రినా కైఫ్, ప్రియంకా చోప్రా లీడ్ రోల్స్‌లో ‘జీ లే జరా’ టైటిల్‌తో తెరకెక్కబోతోందీ సినిమా.

Dil Chahta Hai

త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న ఈసినిమా రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతోంది. ఫర్హాన్ అక్తర్ 20 ఏళ్ల క్రితం ఆమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అక్షయ్ ఖన్నా మల్టీస్టారర్‌గా వచ్చిన ‘దిల్ చాహతా హై’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 2011 లో ఈ రోడ్ ట్రిప్ బ్యాక్ డ్రాప్‌లో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్స్‌లో వచ్చిన ‘జిందగీ నా మిలేగి దుబారా’ సినిమా అంతకుమించి సూపర్ హిట్ అయ్యింది.

Jindagi Na Milegi Dobara

ఇప్పటి వరకూ వచ్చిన ఈ రోడ్ ట్రిప్ మూవీస్‌ని 20 ఏళ్ల తర్వాత డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు ఫర్హాన్ అక్తర్. ఈసారి హీరోలకు బదులు హీరోయిన్లతో ఈ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు టీమ్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఆలియా, కత్రినా, ప్రియాంకా లీడ్ రోల్స్‌లో అమేజింగ్‌గా తెరకెక్కబోతున్న ‘జీ లే జరా’ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. అందుకే ఈ సినిమా మీద ఇప్పటి నుంచే బాలీవుడ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.