Katrina Kaif : త్వరలోనే కత్రినాకైఫ్ తో నిశ్చితార్థం.. స్వయంగా చెప్తా అన్న విక్కీ కౌశల్

బాలీవుడ్‌ యువహీరో విక్కీకౌశల్‌, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు అందరికి తెలుసు. వాళ్ళు డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేయకపోయినా వీళ్లిద్దరు కలిసి

Katrina Kaif  : త్వరలోనే కత్రినాకైఫ్ తో నిశ్చితార్థం.. స్వయంగా చెప్తా అన్న విక్కీ కౌశల్

Vicky

Katrina Kaif : బాలీవుడ్‌ యువహీరో విక్కీకౌశల్‌, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్టు అందరికి తెలుసు. వాళ్ళు డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేయకపోయినా వీళ్లిద్దరు కలిసి సినిమాలకి, షికార్లకి తిరగడమే కాక ఫంక్షన్స్ కి కూడా ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అంతకుముందు కత్రినాకైఫ్ లవ్ ఫెయిల్యూర్స్ చూసింది. మరి వీళ్లిద్దరి ప్రేమ అయినా పెళ్లి పీటలు ఎక్కుతుందా అనుకున్నారు అంతా. అలాంటి వార్తలకి స్వస్తి చెప్పేశాడు విక్కీ కౌశల్.

Bigg Boss 5 : రవికి చాలా దూరంగా ఉండాలి.. అనీ మాస్టర్ టాప్ 5 లో ఉండాలి : శ్వేతా వర్మ

ఇటీవల వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తలొచ్చాయి. వీటిని విక్కీకౌశల్‌ సోదరుడు సన్నీకౌశల్‌ ఖండించారు. తాజాగా విక్కీకౌశల్‌ నటించిన ‘సర్దార్‌ ఉద్ధమ్‌’ చిత్రం రిలిజ్ కి రెడీగా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో కత్రినాకైఫ్‌ కూడా హాజరైంది. ఈ సందర్భంగా పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని విక్కీకౌశల్‌ను మీడియా ప్రశ్నించగా సరైన ముహూర్తం చూసి త్వరలోనే మేమిద్దరం నిశ్చితార్థం చేసుకుంటామని తెలిపారు. అంతేకాక తన ఎంగేజ్‌మెంట్‌పై అనవసర ప్రచారాలు చేయవద్దని, తానే స్వయంగా అందరికి ఆ విషయాన్ని చెప్తానని విక్కీకౌశల్‌ స్పష్టం చేశారు. దీంతో వీళ్లిద్దరు వచ్చే సంవత్సరం లోపు పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ వర్గాలు.