KA Paul: తెలంగాణలో అవినీతిపై కేసీఆర్ నాతో చర్చకు రావాలి: కేఏ పాల్

సోదరుడి హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ అక్రమ కేసులో 2012లో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు కోర్టు స్టేను రద్దు చేసి, నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాపై పెట్టిన తప్పుడు కేసులను మళ్లీ తిరగదోడుతున్నారు.

KA Paul: తెలంగాణలో అవినీతిపై కేసీఆర్ నాతో చర్చకు రావాలి: కేఏ పాల్

KA Paul: తెలంగాణలో అవినీతిపై తనతో సీఎం కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘కేసీఆర్‌కు దీవెనలు వద్దు.. శాపాలు కావాలి.

BRS AP President Chandrasekhar: ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం.. ఏపీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితి ..

ఆయనకు వినాశకాలం వచ్చింది. నా సోదరుడి హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ అక్రమ కేసులో 2012లో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు కోర్టు స్టేను రద్దు చేసి, నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాపై పెట్టిన తప్పుడు కేసులను మళ్లీ తిరగదోడుతున్నారు. కేసీఆర్‌ కోర్టులను కొనలేరు. కేసీఆర్ నన్నేమీ చేయలేరు. తెలంగాణలో అవినీతిపై కేసీఆర్ నాతో గంటపాటు చర్చకు రావాలి. కేసీఆర్ వినాశనం కోసం ప్రార్థనలు చేస్తా. ప్రజాశాంతి పార్టీలో చేరికలు చూసి కేసీఆర్ భయపడుతున్నారు. ఆయన దొర కాదు.. దొంగ అని కోర్టులో నిరూపిస్తా.

Andhra Pradesh: ఏపీ గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్

ఆయనకు ఏడు రోజుల సమయం ఇస్తున్నా. నా అక్రమ కేసులపై స్టే రద్దు అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. కేసీఆర్ నన్ను చంపితే స్వర్గానికి వెళ్తా. ఆయన నరకానికి వెళ్తాడు. అధికారంలోకి వస్తే తెలంగాణలో యువకులకు ఉద్యోగాలు ఇస్తా. రుణమాఫీ చేస్తా. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటా. ప్రపంచాన్ని తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తా. అమరావతిలో సంవత్సరంలో రాజధాని కట్టి చూపిస్తా’’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.