Keerthi Suresh : ‘మహానటి’కి కరోనా

'మహానటి'తో మన అందర్నీ మెప్పించిన కీర్తి సురేష్ తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్.. ''నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా....

Keerthi Suresh :  ‘మహానటి’కి కరోనా

Keerthi Suresh

Updated On : January 11, 2022 / 5:22 PM IST

Keerthi Suresh :   ఇటీవల రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష, ఇషా చావ్లా, రేణుదేశాయ్, లతా మంగేష్కర్, ఖుష్బూ … ఇలా చాలా మంది కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీల్లో వరుస కరోనా కేసులు పెరుగుతుండటంతో సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. తాజాగా మరో హీరోయిన్ కీర్తి సురేష్ కి కరోనా సోకింది.

Unstoppable with NBK : ‘సమరసింహా రెడ్డి’ వెల్‌కమ్స్‌ ‘అర్జున్‌ రెడ్డి’

‘మహానటి’తో మన అందర్నీ మెప్పించిన కీర్తి సురేష్ తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్.. ”నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొన్ని కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది అంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను.” అని పోస్ట్ చేసింది.