Vedalam Telugu remake: క్రేజీ కాంబినేషన్.. మెగాస్టార్ చెల్లిగా మహానటి ఫిక్స్!

సినిమాలో ఏదైనా క్రేజీ కాంబినేషన్.. లేదంటే కాస్త ఇంట్రస్టింగ్ విషయం ఉందంటే సహజంగానే ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మొదలవుతుంది. అందుకే దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్స్ ను మరోసారి వెండితెర మీదకి తెచ్చే ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో.. ఇప్పుడు బిజీ హీరోయిన్స్ ను కూడా హీరోలకు చెల్లెలు పాత్రల కోసం తెచ్చే ప్రయత్నాలు మొదలువుతున్నాయి.

Vedalam Telugu remake: క్రేజీ కాంబినేషన్.. మెగాస్టార్ చెల్లిగా మహానటి ఫిక్స్!

Vedalam Telugu Remake

Vedalam Telugu remake: సినిమాలో ఏదైనా క్రేజీ కాంబినేషన్.. లేదంటే కాస్త ఇంట్రస్టింగ్ విషయం ఉందంటే సహజంగానే ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మొదలవుతుంది. అందుకే దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్స్ ను మరోసారి వెండితెర మీదకి తెచ్చే ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో.. ఇప్పుడు బిజీ హీరోయిన్స్ ను కూడా హీరోలకు చెల్లెలు పాత్రల కోసం తెచ్చే ప్రయత్నాలు మొదలువుతున్నాయి.

ఒకప్పుడు తెలుగు సినిమాలలో ఈ తరహా ట్రెండ్ ఉండేది. కానీ కాలం మారే కొద్దీ హీరోయిన్స్ ఈ తరహా పాత్రలకు దూరమయ్యారు. కాగా.. ఇప్పుడు మెగాస్టార్ సినిమా కోసం మహానటి కీర్తి సురేష్ ను చెల్లిగా తీసుకురానున్నట్లు తెలుస్తుంది. చిరు ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో ఉండగా దాదాపుగా ఇది పూర్తవుతుంది. త్వరలోనే మెగాస్టార్ మరో రెండు రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టనున్నారు. అందులో ఒకటి మలయాళం రీమేక్ లూసిఫర్ కాగా.. మరొకటి తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ సినిమా వేదాళం.

అజిత్, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించనుండగా ఇప్పటికే గత మూడేళ్లుగా ఈ సినిమా కోసం మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాలో అజిత్ కు చెల్లిగా లక్ష్మిమీనన్ నటించగా తెలుగులో ఈ పాత్ర కోసం చాలాకాలంగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా సాయిపల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినిపించగా.. ఫైనల్ గా ఇప్పుడు కీర్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం మహానటికి భారీ మొత్తంలో ముట్టజెప్పనున్నట్లుగా తెలుస్తుంది.

కాగా.. కీర్తి ప్రస్తుతం మహేష్ జంటగా సర్కారు వారి పాటలో నటించనుండగా.. అన్నాత్తై సినిమాలో రజనీ కాంత్ కు కూతురుగా నటిస్తున్నట్లు వినిపిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ కు చెల్లిగా నటించనున్నట్లు చెప్తున్నారు. అదే నిజమైతే మహానటి రేంజ్ మరింత పెరగడం ఖాయం. సూపర్ స్టార్ మహేష్ కు జంట.. మరో సూపర్ స్టార్ రజనీకి కూతురుగా.. మెగాస్టార్ కు చెల్లిగా ఒకేసారి అవకాశాలు దక్కించుకోవడం అంటే నిజంగా మహానటిగా రాసిపెట్టి ఉన్నట్లే చెప్పుకోవాలి.