Bird Flu In Kerala : కొట్టాయంలో బర్డ్ ఫ్లూ..వేలాది బాతులు, కోళ్లను చంపి తగలబెట్టేందుకు బృందాలు

కేరళలో బర్డ్ ప్లూ అధికారులను పరుగులు పెట్టిస్తోంది. కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావటంతో వేలాది కోళ్లను,బాతుల్ని చంపేస్తున్నారు.

Bird Flu In Kerala : కొట్టాయంలో బర్డ్ ఫ్లూ..వేలాది బాతులు, కోళ్లను చంపి తగలబెట్టేందుకు బృందాలు

Kerala Bird Flu (1)

Bird Flu Fear In Kerala : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఉంది కేరళలోని పక్షుల దుస్థితి. మూడు బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావటంతో వేలాది కోళ్లను,బాతుల్ని చంపేస్తున్నారు. పక్షుల నుంచి మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకుతుందనే ముందస్తు జాగ్రత్తతో ఇలా వేలాది పక్షుల్ని చంపేస్తున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు బయటపడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా కోళ్లు, బాతులను సామూహికంగా చంపేసి దహనం చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఈరోజు నుంచే సామూహిక హననాలు ప్రారంభించారు.

కొట్టాయం జిల్లాలోని వేచూర్, అయమనమ్, కల్లార పంచాయతీలలో పక్షుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐ‌హెచ్ఎస్ఏడీ)లో పరీక్షించగా బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, గతవారం పక్కనే ఉన్న అలప్పుజ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ వెలుగులోకి రాగా నియంత్రణ చర్యల్లో భాగంగా పక్షులను చంపేశారు. తాజా కేసులతో కోళ్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. అలప్పుజలో బాతులను చంపి తగలబెట్టేశారు. ఇప్పుడు కొట్టాయంలోనూ ఇలాగే చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read more : Covid-19: పెరిగిన ఒమిక్రాన్.. దేశంలో కొత్తగా 6వేలకు పైగా కరోనా కేసులు

మూడు బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావటంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)లో పరీక్షలు నిర్వహించారు. గత వారం, పొరుగున ఉన్న అలప్పుజా జిల్లాలో ఫ్లూ నిర్ధారించబడింది . వైరస్ నుండి తప్పించుకోవడానికి బాతులు, కోళ్లతో పాటు ఇతర పక్షుల్ని కూడా చంపించారు. అలప్పుజాలో, బర్డ్ ఫ్లూ కేసులతో ఆందోళన మొదలైంది. ఈక్రమంలో కొట్టాయంలో మూడు బర్డ్ ప్లూ కేసులు నిర్ధారణ కావటంతో అధికారులు మరింతగా అప్రమత్తమయ్యారు.

గత కొన్ని వారాలుగా అలప్పుజలో బాతులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. ఒక్క పంచాయతీలోనే ముగ్గురు రైతులకు చెందిన 8 వేలకు పైగా బాతులు చనిపోయాయి. ఇటువంటి పరిస్థితి కొట్టాయంలో రాకుండా ఉండాలనే యంత్రాంగం భావిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం తక్కువగానే ఉన్నప్పటికీ..అది మనుషులకు సంక్రమిస్తే మాత్రం సమస్యలు తప్పవని నిపుణులు సూచనల మేరకు పక్షుల్ని చంపక తప్పటంలేదు.

Read more : Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ కోసం టెక్నాలజీ వాడుతున్న బెజవాడ పోలీసులు

పక్షుల సామూహిక హననం కోసం ఇప్పటికే పలు బృందాలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. ప్రతి బృందంలో ఓ పశువైద్యుడు, ఒక పర్యవేక్షకుడు, ముగ్గురు సహాయకులు ఉండి ఈ హననాల ప్రక్రియను దగ్గరుండి పరిశీలించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బర్డ్ ఫ్లూ కనుక నిర్ధారణ అయితే 28,500 నుంచి 35,000 పక్షులను చంపేయాల్సి ఉంటుంది. కాగా రైతలుకు సంబంధించిన పక్షుల్ని చంపేస్తుండటంతో సదరు రైతులు నష్టపోకుండా ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించనుంది. దీంట్లో భాగంగా 60 రోజుల కంటే తక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.100, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న బాతులకు రూ.200 పరిహారం అందజేయనుంది.