Corona Vaccine Certificate : సొంత ఖర్చులతో టీకా వేయించుకున్నా.. మోదీ ఫోటో తొలగించండి.. కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి

దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సోకినవారి సంఖ్య మూడు కోట్ల మార్కును దాటింది. నాలుగు లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Corona Vaccine Certificate : సొంత ఖర్చులతో టీకా వేయించుకున్నా.. మోదీ ఫోటో తొలగించండి.. కోర్టుకెక్కిన కేరళ వ్యక్తి

Corona Vaccine Certificate

Updated On : October 10, 2021 / 3:06 PM IST

Corona Vaccine Certificate : దేశంలో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా సోకినవారి సంఖ్య మూడు కోట్ల మార్కును దాటింది. నాలుగు లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక జనవరి టీకా వితరణ ప్రారంభం కాగా మొదటి డోసు టీకా తీసుకున్నవారు సంఖ్య 90 కోట్లకు చేరింది. అయితే, టీకా వేసిన తర్వాత జారీ చేసిన టీకా సర్టిఫికెట్‌పై నరేంద్ర మోదీ ఫోటో ఉంటుంది.

Read More :   కరెంటు సంక్షోభం లేదు, నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు

ఈ ఫోటోపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కేరళకు చెందిన ఒక వ్యక్తి మోదీ ఫోటోను తొలగించాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన సొంత డబ్బుతో టీకా తీసుకున్నాను అందువల్ల, మోదీ ఫోటోను సర్టిఫికెట్ నుండి తొలగించాలని కోరారు.

కేరళకు చెందిన ఆర్టీఐ కార్యకర్త పీటర్ మైలిపరంబిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. “ప్రభుత్వం తగినంత కరోనా వ్యాక్సిన్‌ను అందించలేకపోయింది కాబట్టి, నేను కరోనా వ్యాక్సిన్‌కు డబ్బులు చెల్లించాను. అందువల్ల, సర్టిఫికెట్‌పై ఫోటోను ముద్రించి క్రెడిట్ తీసుకునే హక్కు మోదీకి లేదు” అని ఆయన అన్నారు. ఇది తన ప్రాధమిక హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టుకు తెలిపారు.

Read More :  కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి .. రూ.5 లక్షల చొప్పున పరిహారం

“ప్రభుత్వ టీకా కేంద్రంలో స్లాట్ అందుబాటులో లేనందున, తాను ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ కోసం రూ .750 చెల్లించానని పేర్కొన్నాడు. యునైటెడ్ స్టేట్స్, ఇండోనేషియా, ఇజ్రాయెల్, కువైట్, ఫ్రాన్స్ జర్మనీ దేశాలకు చెందిన సర్టిఫికేట్ల కాపీలు కోర్టుకు సమర్పించారు మైలిపరంబిల్. ఈ దేశాలన్నింటిలో, సర్టిఫికెట్‌లో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఫోటోలు లేవని ఆయన చెప్పారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. దీనికి వివరణ ఇవ్వాలని కోరింది.