CM KCR : కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి .. రూ.5 లక్షల చొప్పున పరిహారం

జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు.

CM KCR : కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి .. రూ.5 లక్షల చొప్పున పరిహారం

Cm Kcr

Gadwala district Kottapalli incident : జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని అదేశించారు. కొత్తపల్లిలో గుడిసె గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. సీఎం కేసీఆర్..మంత్రి నిరంజన్ రెడ్డికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

వారి కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, నిర్మాణాలను అధికారులు గుర్తించాలని సూచించారు. ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలని అధికారులన ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. మృతి చెందిన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.

Hut Collapsed : గుడిసె కూలి ఐదుగురు మృతి

అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి గుడిసె గోడ కూలిపోయింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భార్య, భర్త, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.