Delhi : కరెంటు సంక్షోభం లేదు, నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు

రాష్ట్రంలోని కేంద్రాలకు నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ తెలిపారు.

Delhi : కరెంటు సంక్షోభం లేదు, నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు

Current

No Power Crisis : భారతదేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. పలు రాష్ట్రాలో కరెంటు నిలిచిపోతుందనే వార్తలు వినపడుతున్నాయి. సరిపడా బొగ్గు, గ్యాస్ నిల్వలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో సరిపడా నిల్వలు లేకపోవడంతో రెండు, మూడు రోజుల్లో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రజలు జాగ్రత్తగా విద్యుత్ వాడాలని, లేనిపక్షంలో సమస్యలు ఏర్పడుతాయని Tata Power ప్రజలు SMS రూపంలో సమాచారం ఇవ్వడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.

Read More : Aryan Khan : శానిటరీ ప్యాడ్స్‌‌లో డ్రగ్స్ తీసుకెళ్లిన మహిళ!

దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ స్పందించారు. రాష్ట్రంలోని కేంద్రాలకు నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని విద్యుత్ పంపిణీ సంస్థల ఎస్ఎంఎస్ ల అనవసరమైన భయాందోళనలు సృష్టించాయని తెలిపారు. పవర్ స్టేషన్లలో సగటు బొగ్గు నిల్వ ఉందని, ఇది నాలుగు రోజులకు పైగా ఉంటుందని…ప్రతి రోజు స్టాక్ నింపబడుతుందన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని తాను సంప్రదించడం జరుగుతోందని ఓ జాతీయ సంస్థకు వెల్లడించారు. ఆధారం లేని ఎస్ఎంఎస్ లు పంపిన టాటా పవర్ సీఈవోను హెచ్చరించామన్నారు. గ్యాస్ సరఫరా నిలిపివేస్తామని..బవానా గ్యాస్ పవర్ ప్లాంట్ కు GAIL తెలియచేసిందని..దీనిపై GAIL సీఎండీతో మాట్లాడినట్లు వెల్లడించారు. సరఫరా కొనసాగుతుందని ఆయన తనకు హామీనిచ్చారన్నారు. గతంలో గ్యాస్ కొరత లేదని..భవిష్యత్ లో కూడా అదే విధంగా కొసాగుతుందన్నారు.

Read More : AP Coal : విద్యుత్ సంక్షోభం, ఆ సమయంలో…ఏసీలు ఆపేయండి

విద్యుత్ సంక్షోభం కారణంగా పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విద్యుత్ ఉత్పత్తి విషయంలో రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు జారీ చేశాయి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు. విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ ప్రజలకు సూచించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. దేశంలోని 135 బొగ్గు ఆధారిత ప్లాంట్లలో కేవలం మూడు రోజులు మాత్రమే నిల్వలున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.