Kerala Man: కొన్ని గంటల్లో ఇల్లు అమ్మబోతుండగా రూ. కోటి లాటరీ

ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయి.. ఉన్న ఇంటినే అమ్మకానికి పెట్టిన వ్యక్తికి చివరి క్షణాల్లో అదృష్టం కనికరించింది. డబ్బు సర్దుబాటు కోసం ఎంతో ఇష్టపడి కట్టుకున్న కొత్త ఇంటిని అమ్మకానికి సిద్ధపడుతుండగా రూ.కోటి లాటరీ తగిలింది. నార్త్ కేరళలోని మంజేశ్వర్ బంధువులు, బ్యాంకు నుంచి తీసుకున్న రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చింది.

Kerala Man: కొన్ని గంటల్లో ఇల్లు అమ్మబోతుండగా రూ. కోటి లాటరీ

Childredn Theft Money

 

 

Kerala Man: ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయి.. ఉంటున్న ఇంటినే అమ్మకానికి పెట్టిన వ్యక్తికి చివరి క్షణాల్లో అదృష్టం కనికరించింది. డబ్బు సర్దుబాటు కోసం ఎంతో ఇష్టపడి కట్టుకున్న కొత్త ఇంటిని అమ్మకానికి సిద్ధపడుతుండగా రూ.కోటి లాటరీ తగిలింది. నార్త్ కేరళలోని మంజేశ్వర్ బంధువులు, బ్యాంకు నుంచి తీసుకున్న రూ.50 లక్షలు తిరిగి ఇవ్వాల్సిన టైం వచ్చింది.

అతని ఇద్దరి కూతుళ్ల పెళ్లి కోసం భారీగా అప్పులు చేయడమే కాక, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ నష్టాలు చవిచూశాడు. అలా కష్టాల్లో కూరుకుపోయి ఇంటిని అమ్మకానికి పెట్టాడు.

మొహమ్మద్ బావ ఇల్లు ఇప్పుడు ఆనందం, అదృష్టంతో నిండిపోయింది.

“నేను లాటరీ గెలిచా. ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు గెలిచాక నా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయినట్లే. వ్యాపారంలో జరిగిన నష్టాలతో సతమతమవుతున్న వేళ.. ఆ అల్లాహ్ కరుణించి మార్గం చూపించాడు” అని ఆ వ్యక్తి చెబుతున్నాడు.

Read Also: కేరళలో వింత ఫైన్.. వాహనంలో పెట్రోల్ సరిపడా లేదని రూ. 250 చలానా..

50ఏళ్ల వ్యక్తి కేరళ ప్రభుత్వం అమ్మే ఫిఫ్టీ-ఫిఫ్టీ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అప్పుల్లో నుంచి బయటపడేస్తుందని అనుకున్నాడు.

ఆదివారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు లాటరీ రిజల్ట్ అనౌన్స్ చేశారు. అదృష్టవశాత్తు అది నాకు వచ్చింది. అమ్మకానికి పెట్టిన ఇంటికోసం అడ్వాన్స్ ఇచ్చేందుకు రాబోతుండగా ఈ విషయం తెలిసింది. దాంతో వాళ్లు కూడా సంతోషపడ్డారు. నేను రెగ్యూలర్ గా టిక్కెట్లు కొనుగోలు చేయను. లాటరీ ఏజెంట్ మా ఇంటివైపుగా వెళ్తూ.. కొన్ని టిక్కెట్లు ఇచ్చాడు. ఏమవుతుందో చూద్దామని కొన్నానంతే” అని మొహమ్మద్ బవా చెప్తున్నారు.

రూ.కోటి లాటరీకి గానూ రూ.63లక్షలు చేతికి అందుతాయి. వీటిల్లో తాను చేసిన అప్పులు తీర్చి మిగిలిన డబ్బును పేదలకు, అవసరాలున్న వారికి అందజేస్తానని అంటున్నాడు.