physically challenged models : మోడల్‌ గా రాణిస్తున్న దివ్యాంగ యువతులు..

అంగవైకల్యాన్ని జయించి మోడల్స్ గా రాణిస్తున్నారు కేరళకు చెందిన యువతులు. అంగవైకల్యం శరీరానికే మనస్సుకు కాదంటున్నారు ఈ ధీరలు.

physically challenged models : మోడల్‌ గా రాణిస్తున్న దివ్యాంగ యువతులు..

Physically Challenged Models

Updated On : December 11, 2021 / 5:39 PM IST

physically challenged models : మోడల్ అంటే అందంగా చెక్కిన శిల్పంలానే ఉండాలా? క్యాట్ వాక్ చేస్తు హొయలు పోవాలా? పిడికిలిలో ఇమిడిపోయే సన్నటి నాజూకు నడుముతో ర్యాంప్ వాక్ చేయాలా?మైమరపించే అందాలు ఉండాలా? హీల్స్ వేసుకుని ఒయ్యారంగా నడవాలా? మోడల్ అంటే ఇలాగే ఉండాలా? అంటే..కాదని నిరూపించారు కేరళ యువతులు.అంగవైకల్యంతో ఉన్నా మోడల్స్ గా రాణిస్తు మోడల్ అంటే ఇలాగే ఉండాలి అనే మాటను మార్చేశాడు పాతు ఫాతిమా, రెమ్యా గణేష్ అనే కేరళ యువతులు.ఇద్దరు దివ్యాంగులే. అయినా మోడల్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.‘వైకల్యం శరీరానికే కానీ, మనసుకు కాదు’ అంటున్నారు కేరళకు చెందిన ఈ దివ్యాంగ మోడల్స్ పాతు ఫాతిమా, రెమ్యా గణేష్ లు‌. అందం, అంగసౌష్టవం ఉన్నవారికే మోడలింగ్‌ అన్న గీతను చెరిపేశారు.

కేరళకు చెందిన 20 ఏళ్ల ఫాతిమాకు పుట్టుకతో అంగవైకల్యం లేదు. పుట్టిన కొన్ని సంవత్సరాలు అందరు ఆడపిల్లల్లాగానే ఉంది. కానీ ఆమెను అంతుచిక్కని వ్యాధి ఆమె కాలును తినేసింది. ఎన్నో చికిత్సలు చేయించినా ఫలించలేదు. రాచపుండు అంటారే..అలా ఆమె కాలును తొలిచివేసింది ఆ వింత వ్యాధి. ఎటువంటి చికిత్సలకు లొంగలేదు. దీంతో 17 ఏళ్ల వయస్సులో ఆమెకు ఆపరేషన్ చేసి కుడికాలును తీసివేయాల్సి వచ్చింది. ఆ వింత వ్యాధితో ఎంతో బాధ అనుభవించినా..కాలు తీసివేసినా ఆమె కుంగిపోలేదు. కృత్రిమ కాలు అమర్చుకొని పట్టుదలతో అడుగులు వేసింది.

Read more : Daisy-May Demetre : కాళ్లు లేని చిన్నారి క్యాట్ వాక్..ఆత్మవిశ్వాసం ముందు తలవంచిన అంగవైకల్యం

చిన్నపాప బుడి బుడి అడుగులు వేసి నడక నేర్చుకున్నట్లుగా నడక నేర్చుకుంది కృత్రిమ కాలుతో. అలా కొత్త అడుగులతో కొత్త ఆశలు రెక్కలు సృష్టించుకుంది. అవి వీడియోలు చేస్తు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు..తన ప్రతిభను నిరూపించుకుంది. అలాగే ఫొటోషూట్‌లు చేస్తు..చేస్తు తనకంటూ ఓ ప్రత్యేక క్రియేట్ చేసుకుంది.అలా మోడలింగ్‌ దాకా చేరింది. మోడలింగ్ లో ఫాతిమాది ఓ స్పెషల్ స్టైల్. కృత్రిమ కాలుతోనే ఎన్నో ర్యాంప్‌షోల్లో క్యాట్‌వాక్‌ చేసి హ్యాట్సాఫ్‌ అనిపించుకుంది. ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌వీక్‌ గోవాలో నిర్వహించిన పోటీలో 2021 ఆసియా ఫ్యాషన్‌ అవార్డు సాధించింది ఫాతిమా. 2019 నుంచి ఇప్పటికి 20కిపైగా ఫొటోషూట్‌లు చేసింది.

అలాగే కోజికోడ్‌కు చెందిన 32 ఏండ్ల రెమ్యా గణేశ్‌ ది మరో కథ. రెమ్యా 9 నెలల పసిపాపగా ఉన్నప్పుడే పోలియో రాకుండా వేయించుకున్న టీకా ఆమె పాలిట మహమ్మారిగా మారింది. టీకా వికటించి కాళ్లు చచ్చుబడిపోయాయి. అలా చెంగు చెంగున గెంతుతు ఆడుకునే బాల్యమంతా బాధకరంగానే గడిచిపోయింది. ఆమె కష్టాలు అక్కడికే పరిమితం కాలేదు.14వ ఏళ్లకే తండ్రిని కోల్పోయింది. దీంతో చదువూ ఆగిపోయింది. ఎన్నో కష్టాలు పడింది. అలా కొన్నాళ్లకు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో వారు నిర్వహించే కంప్యూటర్‌ కోర్చులు నేర్చుకుంది. పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సులకు వెళుత తన జీవితాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకుంది. ధైర్యాన్ని అలవర్చుకుంది. ఎన్నో విషయాలు తెలుసుకుంది. అలా ఓ కొత్త జీవితాన్నిప్రారంభించింది రెమ్యా.

Read more : Camels Beauty Contest:ఒంటెలకు అందాల పోటీలు..ప్రైజ్‌మనీ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!డబ్బుల కోసం మూగజీవాలపై హింసలు

సాక్షరత మిషన్‌ ద్వారా చదువుకొని మంచి గ్రేడ్‌తో 10 క్లాస్ పాసైంది. రెమ్యా ప్రస్తుతం కోజికోడ్‌లోని మలబార్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌లో డిగ్రీ చదువుతూ.. మోడల్‌గా కూడా చేస్తు మోడలింగ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుతోంది. 2019లో కోజికోడ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియేటివ్‌ మెడిసిన్‌ నిర్వహించిన ‘క్యూరియస్‌’ కార్నివాల్‌లో రెమ్యా చక్కటి ప్రతిభ చూపింది. అదే రెమ్యాకు చక్కటి గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘కేరళకు చెందిన మొదటి వీల్‌చైర్‌ మోడల్‌’గా పేరు తెచ్చుకుంది.

అప్పటినుంచి పలు మలయాళ మ్యాగజైన్‌ల కోసం ఫొటోషూట్‌ చేస్తోంది. తనలో ఉన్న ఈ లోపాన్ని అధిగమించి పట్టుదలతో కొత్త జీవితంలో పయనిస్తోంది.లోపాన్ని శాపం అనుకోకుండా దాన్ని ఓడించింది. అలా కేరళకు చెందిన దివ్యాంగులు ఫాతిమా, రెమ్యా విభిన్న రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. దివ్యాంగుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యం అంటున్నారీ దివ్యాంగ మోడల్స్.