BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం

బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్‌ చేశారు. ప్రతీ బూత్‌లో రెండు వందల మంది క్రియాశీల కార్యకర్తలు ఉండేలా నిర్ణయించారు. కార్యకర్తలతో సమన్వయం కోసం.. ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు.

BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం

Bjp Meetings

BJP meetings : ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ.. అందుకోసం ప్రత్యేక తీర్మాణాలు చేస్తోంది. హైదరాబాద్‌ వేదికగా జరుగుతన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. తెలంగాణపై ప్రత్యేక తీర్మాణం చేయాలని కమలం నేతలు నిర్ణయించారు. బూత్‌ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ప్లాన్‌ చేశారు. ప్రతీ బూత్‌లో రెండు వందల మంది క్రియాశీల కార్యకర్తలు ఉండేలా నిర్ణయించారు. కార్యకర్తలతో సమన్వయం కోసం.. ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు.

పన్నా ప్రముఖ్‌ల నియామకంతో.. బలమైన పునాది నిర్మించాలని కాషాయ నేతలు ఫిక్స్ అయ్యారు. అటు.. సంపర్క్‌ అభియాన్‌ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని.. గరీబ్‌ కల్యాణ్‌ అభియాన్‌ ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చాలని నిర్ణయించారు. రాజకీయ తీర్మానాలపైనా బీజేపీ జాతీయ కార్యవర్గం చర్చించింది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంతో బీజేపీ నేతలు 20 కోట్ల మందిని భాగస్వాములుగా చేర్చుకోనున్నారు.

Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్ లో ప్రధాని హైటెక్స్ ప్రాంగణానికి వెళ్లారు. అనంతరం హెచ్‌ఐసీసీకి చేరుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మోదీ హాజరయ్యారు.

సాయంత్ర 4 గంటలకు ప్రారంభమైన సమావేశాలు రాత్రి 9 గంటలకు వరకు కొనసాగనున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై చర్చించనున్నారు. మళ్లీ అధికారంలోకి రావడం, దక్షిణాదిన పార్టీ బలోపేతంపై ఫోకస్‌ చేసిన కమలం నేతలు.. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. రాత్రికి నోవాటెల్ లో ప్రధాని మోదీ బస చేయనున్నారు.