Hero Yash: యష్ లైఫ్ జర్నీ గురించి మీకు తెలుసా.. తండ్రి ఇప్పటికీ బస్ డ్రైవరే!

కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Hero Yash: యష్ లైఫ్ జర్నీ గురించి మీకు తెలుసా.. తండ్రి ఇప్పటికీ బస్ డ్రైవరే!

Hero Yash

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేజీఎఫ్ కి కొనసాగింపుగా తాజాగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 అంతకు మించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాదిన చాప్టర్ 2 ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తుంది. రెండు సినిమాలతో హీరో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.

Yash : రాకింగ్ స్టార్ యశ్‌కి ఆ హీరోయిన్‌తో కలిసి నటించాలని ఉందట..

అయితే.. పాన్ ఇండియా స్టార్ యష్ లైఫ్ జర్నీ గురించి మీకు తెలుసా?. యష్ అనేది ఇతని అసలు పేరు కాదు. నటుడు అయ్యాక ఇతను పేరు మార్చుకున్నాడు. ఇతని అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. 1986వ సంవత్సరం జనవరి 8న కర్ణాటకలో హసన్ లోని భువనహళ్లిలో జన్మించాడు. యష్ తండ్రి పేరు అరుణ్ కుమార్. ఈయన కె.ఎస్.ఆర్టీసీ డ్రైవర్. ఇతని తల్లి పేరు పుష్ప లతా. యష్ కు ఒక చెల్లెలు కూడా అంది.. ఆమె పేరు నందిని. చదువు తర్వాత నాటక రచయితగా బెనకా డ్రామా బృందంలో చేరిన యష్.. అక్కడ నుండి స్టేజ్ షోలు, టీవీ సీరియల్స్‌తో అరంగేట్రం చేసి ఇప్పుడు ఇలా స్టార్ హీరోగా మారిపోయాడు.

YASH : అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో ఆడవు.. బాలీవుడ్ సినిమాలపై యశ్ వ్యాఖ్యలు..

ఇప్పుడున్న ఈ స్టార్ డమ్ ఏదీ అంత ఈజీగా వచ్చింది కాదు. చదువు తర్వాత ఇంటి నుంచి పారిపోయి జేబులో కేవలం రూ.300తో బెంగళూరుకు చేరిన యష్.. అక్కడ నానా ఇబ్బందులు పడి ఆ సమయంలో తిరిగి ఇంటికి వెళ్లలేక యాక్టర్ గా అదృష్టాన్ని పరిష్కరించుకున్నాడు. ఆ సమయంలో లక్కీగా ఓ వ్యక్తి థియేటర్ బృందంలో పనికి తీసుకున్నాడు. ఆ పని గురించి తనకు ఏమి తెలియకపోయినా.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ.. టీ అందించడం నుంచి రకరకాల పనులు మొదలు పెట్టాడు. ఒకరోజు నాటకం వేసే సమయానికి ఒక ఆర్టిస్టు రాకపోవడంతో ఆ పాత్ర యష్ కి దక్కడం.. అందులో నటనతో అదరగొట్టడం.. అక్కడికి వచ్చిన వాళ్లందరికీ ప్రదర్శన నచ్చి స్టేజీపై తన తొలి ప్రదర్శనను గుర్తించి అవకాశం ఇచ్చారని యశ్ తన లైఫ్ లోని మూమెంట్స్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

KGF2: 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్.. దద్దరిల్లిన బాక్సాఫీస్!

ఇక తన కుటుంబం గురించి వస్తే.. యష్ భార్య రాధికా పండిట్‌. వాళ్ళది ప్రేమ వివాహం కాగా తను కూడా నటి. ఇద్దరూ కలిసి మూడు సినిమాల్లో నటించారు. ‘నందగోకుల’ సీరియల్‌లో యష్ తోపాటే బుల్లితెరకు పరిచయమై అక్కడ నుండి వెండితెరకి.. ఇద్దరూ ప్రేమలో పడడం.. దాదాపు ఎనిమిదేళ్ల ప్రేమ తరవాత 2016లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి ప్రస్తుతం ఓ పాపా, బాబూ. ఇక యష్ నాన్న ముందు కర్ణాటక ఆర్టీసీలో బస్ డ్రైవర్ గా పనిచేసి ప్రస్తుతం బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్పోర్ట్ లో డ్రైవరుగా ఉన్నారు. యష్ నాన్నకు ఆ ఉద్యోగం మానేయమని ఎన్నోసార్లు చెప్పినా వినలేదట. ఆయనకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదని.. యష్ అమ్మ కూడా ఎక్కడికి వెళ్లినా బస్సు, ఆటోల్లో వెళుతుంది. వాళ్లిద్దరికీ సాధారణ జీవితం గడపడం ఇష్టమని చెప్పుకొచ్చిన యష్.. ఇప్పటికీ నేనొక బస్‌ డ్రైవర్‌ కొడుకునని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతా.