KGF2: 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్.. దద్దరిల్లిన బాక్సాఫీస్!

కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్

KGF2: 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్.. దద్దరిల్లిన బాక్సాఫీస్!

KGF2

KGF2: కన్నడ హీరో యశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ మాస్ వర్గాలను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో యశ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు.

RRR-KGF2: కలెక్షన్ల సునామి.. దెబ్బకు బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు!

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. కేజీఎఫ్ సినిమాకి సీక్వెల్‌గా ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారతీయ చరిత్రలోనే ఏ సినిమా కొల్లగొట్టని వసూళ్లను రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా 13 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.466.25కోట్ల షేర్ (రూ. 942.75 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది.

KGF2: ‘ఆర్ఆర్ఆర్’ను టచ్ చేయలేకపోయిన కేజీయఫ్-2

కేజీఎఫ్ 2 సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాలలో రూ.0.94 కోట్ల షేర్ (రూ.1.60 కోట్లు) వసూలు చేసింది. రికార్డు స్థాయిలో జరిగిన రూ.78 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా రూ.79 కోట్ల వసూళ్లతో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీనికి తెలుగులో ఇంకా రూ.3.35 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఏపీలో పలు ప్రాంతాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ వసూళ్లు దక్కలేదు. వరల్డ్ వైడ్ గా.. రూ.345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరగగా రూ.466.25 కోట్ల షేర్ రాబట్టి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దక్కించుకుంది.