Khammam constituency politics : ఖమ్మంలో బీఆర్ఎస్ Vs పొంగులేటి పొలిటికల్ ఫైట్.. శీనన్నదారి ఎటు? గులాబీ గూటికా? హస్తం నీడకా?

తెలంగాణలో అనూహ్యంగా మారిపోతున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కొద్ది రోజుల్లోనే పార్టీ మార్పుపై పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి అది ఏపార్టీ అనేదే ఆసక్తికరంగా మారింది.

Khammam constituency politics : ఖమ్మంలో బీఆర్ఎస్ Vs పొంగులేటి పొలిటికల్ ఫైట్.. శీనన్నదారి ఎటు? గులాబీ గూటికా? హస్తం నీడకా?

Khammam constituency politics  : పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)ని బీఆర్ఎస్ (BRS Party) పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మరి పొంగులేటి ఏ పార్టీలో చేరనున్నారు? ఆయన అనుచరులు ఏపార్టీలో చేరమని సూచిస్తున్నారు? పొంగులేటి ఉద్ధేశ్యమేంటీ? బీజేపీలో చేరాతారనే ప్రచారంలో నిజమెంత?ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చిన క్రమంలో ఆ పార్టీలో చేరతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. మరి పొంగులేటి మదిలో ఏపార్టీలో చేరాలని అనుకుంటున్నారనే విషయంపై తెలంగాణలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

తెలంగాణలో అనూహ్యంగా మారిపోతున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆలస్యం చేయకుండా కొద్ది రోజుల్లోనే పార్టీ మార్పుపై పొంగులేటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మరి అది ఏపార్టీ అనేదే ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ సస్పెండ్ చేయకుముందు నుంచే పొంగులేటి పార్టీకి దూరంగా ఉంటూ ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. రేపు తాను ఏపార్టీలో చేరినా తనకు జనాదరణ తగ్గకుండా చూసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయటంతో ఫుల్ గా ఇక ఏపార్టీలో చేరాలా? అనే ఆలోచనలు పొంగులేటి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకంటే ఆలస్యం చేస్తే క్యాడర్ చేయి జారుతుందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు పొంగులేటికి.

BRS Suspends Ponguleti : నన్ను సస్పెండ్ చేయటం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది : పొంగులేటి

ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం పూర్తి కాగానే ఏపార్టీలో చేరతారు అనేదానిపై పొంగులేటి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.మరో వారం రోజుల్లో ఖమ్మం ఆత్మీయ సమ్మేళనం ఉండే అవకాశం ఉండటంతో ఆ తరువాతే ఏ పార్టీఅనేది తెలియనుంది.బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగిరేసిన తర్వాత జనవరి నుంచి ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభించిన పొంగులేటి..ప్రజల్లో తన ఆదరణను పెంచుకుంటునే మరోవైపు పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికి 9 నియోజకవర్గాల్లో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసిన పొంగులేటి తద్వారా తన క్యాడర్ ను బలపరుచుకునే యత్నాలు చేస్తున్నారు.

ఈక్రమంలో ప్రస్తుతం పొంగులేటి ముందున్న రెండు ఆప్షన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆప్షన్-1 బీజేపీ, ఆప్షన్-కాంగ్రెస్ రెండిట్లో ఒక పార్టీకి వెళ్లడమా? అనే మల్లగుల్లాలు జరుగుతున్నాయి. ఈ రెండూ జాతీయ పార్టీలే కాబట్టి ఈ రెండింటిలో ఒకదానిలో చేరే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఆయన క్యాడర్ మాత్రం కాంగ్రెస్ లోకే చేరమన్నట్లుగా పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది.మరో వైపు పొంగులేటిపై ఎదురుదాడి పెంచారు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
అన్ని నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్ లు పెట్టి పొంగులేటి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవరని, ఎవరిని అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ పొంగులేటి సవాలు విసరడంపై ఆగ్రహంతో ఉన్న ఎమ్మెల్యేలు..పొంగులేటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.దీంతో ఖమ్మంలో బీఆర్ఎస్ వర్సెస్ పొంగులేటి గా మారింది పొలిటికల్ ఫైట్..

BRS Suspends Ponguleti: వేటు పడింది..! బీఆర్ఎస్ పార్టీ నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్

2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి కేవలం ఒక్క సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కసీటు కూడా రాకుండా చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వనని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.

ఈ సవాల్ ను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకటి పొంగులేటిని దెబ్బకొట్టి తన ప్రాభవాన్ని పెంచుకోవటానికి ఇప్పనుంచి కసరత్తులు మొదలుపెట్టేసింది. నేను బీఆర్ఎస్ సభ్యుడినే కాదంటూ ఆపార్టీ నేతలు అన్నారు. మరి పార్టీ సభ్యుడినే కానప్పుడు తనను ఎలా సస్పెండ్ చేస్తారు? అంటూ ప్రశ్నించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ఇప్పుడు తనని సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని..తన సస్పెన్షన్ ఎలా ఉందంటే దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇలా పొంగులేటి చేసే వ్యాఖ్యలపైనా..సవాళ్లపైనా బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రెస్ మీట్లు పెట్టి మరీ పొంగులేటిపై విమర్శలు..మాటల దాడులు చేస్తోంది. ఇలా బీఆర్ఎస్ పొంగులేటిగా ఖమ్మం రాజకీయాలు మరింత హీటెక్కాయి.

Jupally Krishna Rao : పంజరంలోంచి బయటపడినట్లుగా ఉంది.. సస్పెన్షన్‌పై జూపల్లి సంచలన వ్యాఖ్యలు