Kiren Rijiju: బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేతకు భంగపాటు.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన హామీని నిలబెట్టుకుందా అని తన మద్దతుదారులనే ప్రశ్నించారు. ఖర్గే మాటలకు భయాందోళనకు గురైన ప్రేక్షకులు ‘అవును’ అంటూ గట్టిగా స్పందించారు’’ అని ట్వీట్ చేశారు.

Kiren Rijiju: బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేతకు భంగపాటు.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

kiren rijiju mocking karge with video over 2 crore jobs promised by modi

Updated On : July 13, 2023 / 12:11 PM IST

Kiren Rijiju: కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేకు ఒక బహిరంగ సభలో భంగపాటు ఎదురైంది. భారతీయ జనతా పార్టీ, నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్న తరుణంలో కాంగ్రెస్ సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రశ్నించగా వారు విచిత్రమైన సమాధానం చెప్పారు. దీనికి ఖర్గే ఒక్కసారిగా ఖంగుతిన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖర్గేను ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన సందర్భం’ అంటూ రిజిజు రాసుకొచ్చారు.

Anti-Pak protests: భారత్‌లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను కలిపేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన అక్కడి ప్రజలు

రిజిజు షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలను బహిరంగ సభలో ప్రస్తావించారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ పచ్చి అబద్ధాల కోరు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెప్తారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు అన్నారు. కానీ వాస్తవంలో ఏం జరిగింది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీని ప్రధాని నిలబెట్టుకున్నారా?’’ అని ఖర్గే ప్రశ్నించగా, సభలో ఉన్న ప్రేక్షకులు ‘అవును’ అని సమాధానం చెప్పారు. దీంతో షాక్‭కి గురవ్వడం ఖర్గే వంతైంది.

Kerala: ‘సర్’, ‘మేడమ్’ అని విద్యార్థులు పిలవద్దు.. టీచర్ అని పిలవాలి: బాలల హక్కుల కమిషన్

ఇక ఈ వీడియోను రిజిజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కాంగ్రెస్ పార్టీకి ఇదేం ఇబ్బంది? మోదీని ఎగతాళి చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుకున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాటల్ని ప్రస్తావించి, బీజేపీ తన హామీని నిలబెట్టుకుందా అని తన మద్దతుదారులనే ప్రశ్నించారు. ఖర్గే మాటలకు భయాందోళనకు గురైన ప్రేక్షకులు ‘అవును’ అంటూ గట్టిగా స్పందించారు’’ అని ట్వీట్ చేశారు.