KL Rahul: గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రాహుల్.. 4వేల క్ల‌బ్‌లోకి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల ప‌రుగులు పూర్తి చేశాడు.

KL Rahul: గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రాహుల్.. 4వేల క్ల‌బ్‌లోకి

KL Rahul

KL Rahul: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌ కేఎల్ రాహుల్(KL Rahul) ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల ప‌రుగులు పూర్తి చేశాడు. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ క్ర‌మంలో వెస్టిండీస్ బ్యాట‌ర్ క్రిస్ గ్రేల్(Chris Gayle) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 4వేల ప‌రుగులు చేసేందుకు క్రిస్‌గేల్‌కు 112 ఇన్సింగ్స్‌లు అవ‌స‌రం కాగా.. రాహుల్ కేవ‌లం 105 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకుని తొలి స్థానంలో నిలిచాడు.

Ipl 2023, RCB vs DC: బెంగ‌ళూరు విజ‌యం.. ఢిల్లీ ఐదో ఓట‌మి

ఇక ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లి(Virat Kohli) నెల‌కొల్పిన రికార్డును సైతం రాహుల్ బ‌ద్ద‌లు కొట్టాడు. కోహ్లి 128 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న 14వ బ్యాటర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, క్రిస్ గేల్, రాబిన్ ఉతప్ప, దినేష్ కార్తీక్, అంబటి రాయుడు, గౌతం గంభీర్, అజింక్యా రహానే ఉన్నారు.

కెప్టెన్‌గా 2వేల పరుగులు

ఇక కెప్టెన్‌గా 2వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్‌లో సార‌ధిగా అత్యంత వేగంగా 2వేల ప‌రుగులు పూర్తి చేసిన రెండో బ్యాట‌ర్‌గా నిలిచాడు. వార్న‌ర్ 46 ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌న‌త‌ను సాధించ‌గా.. రాహుల్ 47 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అయితే.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 50 కంటే ఎక్కువ సగటుతో 2000 పరుగులకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ రాహుల్ కావ‌డం గ‌మ‌నార్హం.

KL Rahul-Memes: కేఎల్ రాహుల్ పై మరోసారి సెటైర్లు.. మీమ్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు