KL Rahul-Memes: కేఎల్ రాహుల్ పై మరోసారి సెటైర్లు.. మీమ్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతుండడంతో అతడిపై సోషల్ మీడియాలో తరుచూ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే, ఇవాళ జట్టులో కేఎల్ రాహుల్ లేకపోయినప్పటికీ అతడిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం.

KL Rahul-Memes: కేఎల్ రాహుల్ పై మరోసారి సెటైర్లు.. మీమ్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు

KL Rahul-Memes

KL Rahul-Memes: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా విఫలం అవుతుండడంతో అతడిపై సోషల్ మీడియాలో తరుచూ ట్రోలింగ్ జరుగుతుంది. అయితే, ఇవాళ జట్టులో కేఎల్ రాహుల్ లేకపోయినప్పటికీ అతడిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండడం గమనార్హం.

ఆస్ట్రేలియాతో ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో కేఎల్ రాహుల్ లేడన్న విషయం తెలిసిందే. రోహిత్ తో కలిసి ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ వచ్చాడు. 18 బంతుల్లో 21 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 17 పరుగులు, రెండో ఇన్సింగ్ లో ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ ఇవాళ తుది జట్టులో లేకపోవడంతో అతడిపై ట్రోలింగ్ జరుగుతోంది.

ఓపెనర్ గా వచ్చి అంతగా పరుగులు చేయకుండానే ఔట్ అవుతున్న కేఎల్ రాహుల్ ను పక్కనబెట్టి మంచి పని చేశారని, దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నామని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నేడు తుది జట్టులో కేఎల్ రాహుల్ లేడని తెలుసుకుని మొక్కులు చెల్లించుకున్నామని కొందరు మీమ్స్ సృష్టించారు. కాగా, మొదటి రెండు టెస్టుల్లో కేఎల్ రాహుల్ సరిగ్గా ఆడకపోయినప్పటికీ అతడిని మిగతా రెండు మ్యాచుల్లో స్క్వాడ్ లో తీసుకోవడం పట్ల ఇటీవలే నెటిజన్లు మండిపడ్డారు.

India vs Australia 3rd Test: ఇండోర్ టెస్ట్ గెలిస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా ..