Sri Kapileswara Swamy : తిరుపతిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఎప్పుడంటే

శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

Sri Kapileswara Swamy : తిరుపతిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఎప్పుడంటే

Tirupathi

Koil Alwar Thirumanjanam : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కంటే ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఆలయంలో ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 20వ తేదీ తెల్లవారుజామున స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారని తెలిపారు. అలంకారం, శుద్ధి నిర్వహించిన తర్వాత 11.30 నుంచి మధ్యాహ్నం 02.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అర్చకులు నిర్వహిస్తారన్నారు. భక్తులకు దర్శనం ఉండబోదని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Read More : TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.84కోట్ల విరాళం

ఇదిలా ఉంటే…తిరుమల తిరుపతి దేవస్థానానికి రికార్డుస్థాయిలో విరాళాలు వెల్లువెత్తాయి. గురువారం ఒక్కరోజే ఏకంగా 84 కోట్ల రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు. టీటీడీ చరిత్రలోనే ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మొత్తాన్ని 70 మంది దాతలు ఇచ్చారు. టీటీడీ నూతన పథకంలో భాగంగా పద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని 230 కోట్ల రూపాయల వ్యయంతో రెండేళ్లలో మల్టీ స్పెషాలటీ ఆసుపత్రిగా మార్చనుంది. ఇందుకోసం విరాళాలు సేకరిస్తోంది. పేద పిల్లలకు మల్టీ సూపర్‌ స్పెషాలటి ఆసుపత్రిలో.. గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా చేయనున్నారు. తొలి వంద రోజులు వంద సర్జరీలు ఫ్రీగా చేయనుంది. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌ డొనేషన్‌ స్కీమ్‌ కింద.. ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా ఈ మొత్తం సేకరించింది టీటీడీ.

Read More : Tirupati : నెరవేరబోతున్న తిరుపతి నగర వాసుల కల

తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలటీ ఆసుపత్రి నిర్మాణానికి.. భక్తుల నుంచి విరాళాలు స్వీకరించిన వారికి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తోంది టీటీడీ. మొత్తం 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతల కోసం కేటాయించింది టీటీడీ. భక్తులతో పాటు, కంపెనీలు ఉదయాస్తమాన సేవా టికెట్లు తీసుకుని విరాళాలు ఇస్తున్నాయి. శుక్రవారం ఉదయాస్తమాన సేవా టికెట్లను గురువారం 70 మంది తీసుకున్నారు. దాతల్లో 28 మంది కోటి 50 లక్షల చొప్పున విరాళం అందిస్తే, మరో 42 మంది కోటి చొప్పున ఇచ్చారు. మొత్తం 531 ఉదయాస్తమాన సేవా టికెట్ల ద్వారా మొత్తం 550 కోట్లు సమకూరుతాయని టీటీడీ భావిస్తోంది.