Rinku Singh: ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టిన రింకు సింగ్.. చిన్నతనంలో తండ్రిచేత దెబ్బలు తినేవాడట.. ఎందుకంటే?

ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసి రాత్రికిరాత్రే స్టార్ క్రికెటర్‌గా మారిపోయాడు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్. చివరి ఓవర్లో ఐదు బాల్స్‌కు ఐదు సిక్సులు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రింకు సింగ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు.

Rinku Singh: ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టిన రింకు సింగ్.. చిన్నతనంలో తండ్రిచేత దెబ్బలు తినేవాడట.. ఎందుకంటే?

Rinku Singh

Rinku Singh: రింకు సింగ్.. రాత్రికిరాత్రే దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఒకే ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి సాధ్యం కాదనుకున్న జట్టు విజయాన్ని సుసాధ్యం చేసిన క్రికెటర్. దీంతో ఎవరీ రింకు సింగ్ అని వెతుకులాట మొదలు పెట్టారు క్రికెట్ ప్రేమికులు. ఐపీఎల్ 2023 టోర్నీలో భాగంగా ఆదివారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో వెంకటేశ్ అయ్యర్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. కోల్‌కతా విజయం సాధించాలంటే చివరి ఓవర్లో 29 పరుగులు కావాలి. చివరి ఓవర్ యశ్ దయాల్ వేస్తున్నాడు. తొలి బంతికి ఉమేష్ యాదవ్ సింగిల్ తీసి రింకూ సింగ్ కు స్ట్రైక్ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ దే విజయమని అందరూ డిసైడ్ అయిన సమయంలో వరుసగా ఐదు బాల్స్ కు ఐదు సిక్సులు కొట్టి కోల్‌‌కతా జట్టును రింకూ సింగ్ విజయతీరాలకు చేర్చాడు.

IPL2022 Rajasthan Vs KKR : రాణించిన రానా, రింకూ సింగ్.. కోల్‌కతా వరుస ఓటములకు బ్రేక్

Rinku Singh with Shah Rukh Khan

Rinku Singh with Shah Rukh Khan

ఏడు బంతుల్లో 40 పరుగులు..

కెప్టెన్ నితీష్ రాణా ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ తొలుత నెమ్మదిగా ఆడాడు. కేవలం 14 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, చివరి ఏడు బంతుల్లో రింకు సింగ్ 40 పరుగులు చేశారు. మొత్తం 21 బాల్స్ ఎదుర్కొన్న రింకు 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అందులో ఆరు సిక్స్ లు, ఒక ఫోర్ ఉంది. అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసి కోల్‌కతా జట్టుకు విజయాన్ని అందించడంతో రింకూ సింగ్ పేరు రాత్రికిరాత్రే మారుమోగి పోతుంది. క్రికెట్ ప్రేమికులు ఎవరీ రింకూ సింగ్ అంటూ వెతికేస్తున్నారు.

IPL 2023, GT VS KKR: న‌మ్మ‌శ‌క్యం కాని రింకు సింగ్ బ్యాటింగ్‌.. ఐదు బంతుల‌కు 5 సిక్స‌ర్లు.. కోల్‌క‌తా సంచ‌ల‌న విజ‌యం

Rinku Singh

Rinku Singh

తండ్రితో ఎప్పుడూ దెబ్బలు తినేవాడు..

రింకు సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్. 1997లో జన్మించాడు. అతనికి ఐదుగురు తోబుట్టువులు. వారిలో రింకు మూడో వాడు. రింకు కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగా ఉండేది కాదు. అతని తండ్రి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేవాడు. రింకుకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే పిచ్చి. రింకు తండ్రి మాత్రం క్రికెట్ ఆడితే ఒప్పుకొనేవాడు కాదు. దీంతో నిత్యం రింకు క్రికెట్ ఆడేందుకు పోవటం తండ్రి చేత దెబ్బలు తినడం జరిగేదట. ఢిల్లీలో జరిగిన ఓ టోర్నీలో ఆడిన రింకుకు ఓ బైక్ బహుమతిగా వచ్చింది. దాన్ని తీసుకెళ్లి తండ్రికి చూపించాడు రింకు. ఇకఅంతే.. ఆ రోజు నుంచి క్రికెట్ ఆడితే రింకును దెబ్బలు కొట్టడం తండ్రి మానేశాడు. క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించాడు.

IPL 2023 : హమ్మయ్య.. హైదరాబాద్ గెలిచింది, రెండు ఓటముల తర్వాత విజయం

స్వీపర్‌గా పనిచేసిన రింకు..

రింకు సింగ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండేదికాదు. దీంతో తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చేది. రింకు పెద్దగా చదువుకోలేదు. దీంతో కోచింగ్ సెంటర్‌లో స్వీపర్ గా కూడా ఉద్యోగం చేశాడు. కొద్దిరోజులకు స్వీపర్ పనికి గుడ్ బై చెప్పి క్రికెట్‌పై దృష్టిపెట్టాడు. అప్పటి నుంచి రింకు తన శిక్షకులు, స్నేహితుల ఆర్థిక సహాయంతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.

 

2018 నుంచి కోల్‌కతా జట్టులోనే ..

2018 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రింకు సింగ్‌ను రూ. 80లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కేకేఆర్ జట్టుతో రింకుకు అనుబంధం ఉంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో అతను మోకాలి గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2022 ఐపీఎల్ వేలంలో రింకును రూ. 55లక్షలకు కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రింకు కేవలం 15 బంతుల్లో 40 పరుగులు చేశాడు. తరువాత ఇన్నింగ్స్‌లో రింకుకు జట్టులో అవకాశం దక్కలేదు. రింకు ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీలో 20 మ్యాచ్‌లు ఆడాడు. 29.93 సగటుతో 349 పరగులు చేశాడు. రింకూ 2018 ఐపీఎల్ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2019లో ఐదు, 2020లో ఒక్క మ్యాచ్, 2022 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు, 2023 ఐపీఎల్ సీజన్ (ప్రస్తుతం జరుగుతుంది)లో మూడు మ్యాచ్ ఆడు ఆడాడు.