IPL2022 Rajasthan Vs KKR : రాణించిన రానా, రింకూ సింగ్.. కోల్‌కతా వరుస ఓటములకు బ్రేక్
కీలక మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. రాజస్తాన్ నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
![IPL2022 Rajasthan Vs KKR : రాణించిన రానా, రింకూ సింగ్.. కోల్‌కతా వరుస ఓటములకు బ్రేక్ IPL2022 Rajasthan Vs KKR : రాణించిన రానా, రింకూ సింగ్.. కోల్‌కతా వరుస ఓటములకు బ్రేక్](https://10tv.in/wp-content/uploads/2022/05/IPL2022-Rajasthan-Vs-KKR.jpg)
Ipl2022 Rajasthan Vs Kkr
IPL2022 Rajasthan Vs KKR : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. కీలక మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొట్టింది. రాజస్తాన్ నిర్దేశించిన 153 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ పై గెలుపొందింది.
కోల్ కతా జట్టు 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటర్లలో నితీశ్ రానా(37 బంతుల్లో 48 పరుగులు), రింకూ సింగ్(23 బంతుల్లో 42 పరుగులు) అదరగొట్టారు. వీరిద్దరూ నాటౌట్ గా నిలవడమే కాదు జట్టుని గెలిపించారు కూడా. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 34 పరుగులు) రాణించాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, రింకూ సింగ్ 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్లో ఒక పరుగు అవసరం కాగా, నితీశ్ సిక్స్ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్ దీప్ సేన తలో వికెట్ తీశారు.
MS Dhoni: కెప్టెన్ రిటర్న్స్, వచ్చే ఏడాది కూడా సీఎస్కే జెర్సీతోనే
ఈ విజయంతో కోల్ కతా వరుస ఓటములకు బ్రేక్ పడినట్లు అయ్యింది. శ్రేయస్ సేనకు 5 పరాజయాల తర్వాత ఇదే తొలి విజయం. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నాలుగింట్లో గెలిచింది. కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకోవాలంటే మిగతా అన్ని మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్తాన్‌కు(12) ఇది వరుసగా రెండో పరాజయం. సంజూసేన 10 మ్యాచుల్లో 6 విజయాలు సాధించింది.
![IPL2022 Rajasthan Vs KKR Kolkata Knight Riders won by 7 wickets on Rajasthan Royals](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2022/05/kkr-1024x576.jpg)
IPL2022 Rajasthan Vs KKR Kolkata Knight Riders won by 7 wickets on Rajasthan Royals
కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులే చేసింది. భారీ హిట్టర్లు ఉన్న రాజస్తాన్ జట్టును కోల్ కతా బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. రాజస్తాన్ భారీ స్కోర్ ఆశలకు కోల్ కతా బౌలర్లు కళ్లెం వేశారు. కోల్ కతా బౌలర్లలో టిమ్ సౌథీ 2 వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, అనుకుల్ రాయ్, శివం మావి చెరో వికెట్ తీశారు.
IPL2022 SRH Vs CSK : ధోని నాయకత్వం.. హైదరాబాద్‌పై చెన్నై ఘన విజయం
సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 54 పరుగులతో(49 బంతుల్లో) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ జోస్ బట్లర్ 22 పరుగులు చేయగా, ఆఖర్లో షిమ్రోన్ హెట్ మైర్ వేగంగా ఆడడంతో రాజస్తాన్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. హెట్ మైర్ 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
![IPL2022 Rajasthan Vs KKR Kolkata Knight Riders won by 7 wickets on Rajasthan Royals](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2022/05/rr-1-1024x576.jpg)
IPL2022 Rajasthan Vs KKR Kolkata Knight Riders won by 7 wickets on Rajasthan Royals
జట్ల వివరాలు:
రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రోన్ హెట్ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్,ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ సేన్.
A well deserved Player of the Match award for Rinku Singh for his brilliant knock of 42* as #KKR win by 7 wickets.#TATAIPL #KKRvRR pic.twitter.com/TFTEb3QHnh
— IndianPremierLeague (@IPL) May 2, 2022
కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆరోన్ ఫించ్, సునిల్ నరైన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), బాబా ఇంద్రజిత్, నితీశ్ రానా, అనుకుల్ రాయ్, ఆండ్రూ రస్సెల్, రింకు సింగ్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, శివమ్ మావి.
Nitish Rana with a maximum to finish it off as @KKRiders win by 7 wickets and add two much needed points to their tally.
Scorecard – https://t.co/fVVHGJTNYn #KKRvRR #TATAIPL pic.twitter.com/cEgI86p4Gn
— IndianPremierLeague (@IPL) May 2, 2022