IPL2022 SRH Vs CSK : ధోని నాయకత్వం.. హైదరాబాద్‌పై చెన్నై ఘన విజయం

ఈ మ్యాచ్ లో చెన్నై అదరగొట్టింది. హైదరాబాద్ ని చిత్తు చేసింది. చెన్నై నిర్దేశించిన 203 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్..

IPL2022 SRH Vs CSK : ధోని నాయకత్వం.. హైదరాబాద్‌పై చెన్నై ఘన విజయం

IPL2022 SRH Vs CSK

IPL2022 SRH Vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో చెన్నై అదరగొట్టింది. హైదరాబాద్ ని చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ బ్యాటర్లు పోరాడి ఓడారు. చెన్నై నిర్దేశించిన 203 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులకు పరిమితమైంది.

ఫలితంగా 13 పరుగుల తేడాతో హైదరాబాద్ పై సీఎస్కే గెలుపొందింది. హైదరాబాద్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పూరన్ 33 బంతుల్లోనే 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 6 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. పూరన్ చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.

IPL2022 SRH Vs CSK

IPL2022 SRH Vs CSK

ఓపెనర్లు అభిషేక్ శర్మ(39), కేన్ విలియమ్ సన్(47) రాణించారు. అయినా హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. మిగతా బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి డకౌట్‌ కాగా.. మార్‌క్రమ్ 17, శశాంక్‌ 15, వాషింగ్టన్‌ సుందర్‌ 2 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి అదరగొట్టాడు. నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. కాగా, ప్రస్తుత సీజన్‌లో రవీంద్ర జడేజా నుంచి ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక చెన్నై మొదటి విజయం నమోదు చేయడం విశేషం.

IPL2022 RCB Vs GT : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం..!

తొలుత చెన్నై బ్యాటింగ్ చేయగా, బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు దంచి కొట్టారు. పరుగుల వరద పారించారు. రుతురాజ్ గైక్వాడ్ (99), డెవన్ కాన్వే(85*) ధాటిగా ఆడారు. ఫలితంగా చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. హైదరాబాద్ ముందు 203 పరుగులు బిగ్ టార్గెట్ నిర్దేశించింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ కే రెండు వికెట్లు పడ్డాయి.

IPL2022 SRH Vs CSK

IPL2022 SRH Vs CSK

చెన్నై ఓపెనర్లు రుతురాజ్, కాన్వే తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రుతురాజ్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ 8, జడేజా ఒక పరుగు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లోనే 99 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. హైదరాబాద్‌ బౌలర్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకోవడంతో నేరుగా భువనేశ్వర్ కుమార్‌ చేతిలో పడింది. దీంతో రుతురాజ్ కి సెంచరీ చేసే అవకాశం మిస్‌ అయింది. డెవన్ కాన్వే 55 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 8 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.

హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. నటరాజన్ కూడా ధారాళంగా పరుగులు (4 ఓవర్లలో 42 పరుగులు) ఇచ్చినా రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుత సీజన్‌లో పాయింట్ల టేబుల్ పరంగా అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్న చెన్నైను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఎంఎస్ ధోనీ జట్టు పగ్గాలను చేపట్టాడు. రవీంద్ర జడేజా తన ఆటపై దృష్టిసారించేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. చెన్నైతో పోరులో టాస్‌ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకుని చెన్నైకి బ్యాటింగ్‌ అప్పగించాడు.

IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ

ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత సారథ్య బాధ్యతలను చేపట్టిన ధోని చెన్నై తలరాతను మార్చాడు. రాగానే విజయం సాధించి పెట్టాడు. ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో తొలి రౌండ్‌లో చెన్నైను ఓడించి పాయింట్ల ఖాతాను ఓపెన్‌ చేసిన హైదరాబాద్.. ఈసారి మాత్రం ఓటమి పాలైంది. హైదరాబాద్ ను ఓడించి చెన్నై ప్రతీకారం తీర్చుకుంది.

జట్ల వివరాలు:

సన్ రైజర్స్ హైదరాబాద్ ‌: అభిషేక్ శర్మ, కేన్‌ విలియమ్సన్ (కెప్టెన్‌), రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్‌ పూరన్, శశాంక్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్, నటరాజన్‌.

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్‌ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, డెవన్‌ కాన్వే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), మిచెల్ సాంట్నర్, డ్వేన్‌ ప్రిటోరియస్‌, సిమర్‌జీత్ సింగ్, ముకేశ్‌ చౌదరి, మహీశా తీక్షణ.