IPL2022 RCB Vs GT : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం..!

ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గుజరాత్ ఖాతాలో మరో విజయం చేరింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో..

IPL2022 RCB Vs GT : బెంగళూరుని చిత్తు చేసిన గుజరాత్.. ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం..!

Ipl2022 Rcb Vs Gt

IPL2022 RCB Vs GT : ఐపీఎల్ 2022 సీజన్ 15లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. గుజరాత్ ఖాతాలో మరో విజయం చేరింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ అదరగొట్టింది. 6 వికెట్ల తేడాతో బెంగళూరుని చిత్తు చేసింది.

బెంగళూరు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (3) విఫలం కాగా.. రాహుల్ తెవాతియా (43*), డేవిడ్ మిల్లర్ (39*), వృద్ధిమాన్‌ సాహా (29), శుభ్‌మన్ గిల్ (31), సాయి సుదర్శన్ (20) రాణించారు. బెంగళూరు బౌలర్లలో షాహ్‌బాజ్, హసరంగ తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో గుజరాత్‌ (16) ప్లేఆఫ్స్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే.(IPL2022 RCB Vs GT)

Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. కాగా, గుజరాత్‌ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో బెంగళూరు భారీ స్కోర్ చేసే చాన్స్ కోల్పోయింది. బెంగళూర బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (58), రజత్‌ పాటిదార్‌ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చాలారోజుల తర్వాత ఫామ్ అందిపుచ్చుకున్న విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33 పరుగులు) ధాటిగా ఆడాడు. అయితే గుజరాత్‌ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. డుప్లెసిస్‌ డకౌట్‌ కాగా.. షాహ్‌బాజ్‌ 2*, మహిపాల్ లామ్రోర్ 16 పరుగులు చేశారు.

అల్జారీ జోసెఫ్‌ వేసిన ఓవర్‌లో లామ్రోర్ కొట్టిన బంతి రోప్‌కు తాకడంతో డేవిడ్ మిల్లర్‌ క్యాచ్‌ పట్టినా అంపైర్లు నాటౌట్‌గా తేల్చారు. అయితే చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన లామ్రోర్‌.. బౌండరీ లైన్‌ వద్ద మిల్లర్‌కే చిక్కాడు. గుజరాత్‌ బౌలర్లలో ప్రదీప్‌ సంగ్వాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, అల్జారీ జోసెఫ్‌, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.

కాగా, కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్రంగా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి… ఎట్టకేలకు రాణించాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఫిఫ్టీ కొట్టాడు.

విరాట్ కోహ్లి 45 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ ఐపీఎల్ లో 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు విరాట్ కోహ్లి. కాగా, శనివారం గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన విరాట్ కోహ్లి.. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ ఫిఫ్టీ కొట్టగానే గ్యాలరీలో ఉన్న విరాట్ భార్య అనుష్క శర్మ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. కాగా, హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే విరాట్ ఔటయ్యాడు. 53 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

Virat Kohli : సమంత సాంగ్‌‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్

ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన గుజరాత్.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక, బెంగళూరు విషయానికొస్తే.. 10 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్ లో గెలుపొంది ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని బెంగళూరు భావించింది. అయితే, ఇందులోనూ విజయం సాధించి అగ్రస్థానం పదిలపరుచుకుంది గుజరాత్.

చరిత్ర సృష్టించిన గుజరాత్..
కాగా, గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ లో ఆడిన 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించిన ఏకైక జట్టుగా నిలిచింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రమే గుజరాత్ టైటాన్స్ ఓడింది. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ సీజన్ లో చాలా బలైమన జట్టుగా గుజరాత్ మారింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:

డుప్లెసిస్‌(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రజత్‌ పాటిదార్‌, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాబ్ అహ్మద్‌, మహిపాల్ లోమ్రార్‌, హసరంగ, హర్షల్ పటేల్, సిరాజ్, హేజిల్‌వుడ్‌.

గుజరాత్‌ టైటాన్స్ జట్టు:

శుభమన్ గిల్‌, వృద్ధీమాన్‌ సాహా, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), సాయి సుదర్శన్‌, డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్‌ఖాన్‌, ప్రదీప్‌ సాంగ్వాన్‌, అల్జరీ జోసెఫ్‌, ఫెర్గూసన్‌, షమీ.