IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ

ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఈ సీజన్ లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది.(IPL2022 Mumbai vs Rajasthan)

IPL2022 Mumbai vs Rajasthan : రోహిత్‌కు బర్త్‌డే గిఫ్ట్.. ఎట్టకేలకు ముంబై బోణీ

Ipl2022 Mi Vs Rr

IPL2022 Mumbai vs Rajasthan : ఐపీఎల్ 2022 సీజన్ 15లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ముంబై ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ఈ సీజన్ లో ముంబై తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా 8 ఓటముల తర్వాత తన 9వ మ్యాచ్ లో ముంబై గెలుపొందింది. శనివారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ముంబై. దీంతో టోర్నీలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

రాజస్తాన్‌ నిర్దేశించిన 159 పరుగుల టార్గెట్ ను 19.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్‌ (51) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యాదవ్ 39 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. తిలక్‌వర్మ (35), ఇషాన్‌ కిషన్‌ (26), టిమ్ డేవిడ్ (20*) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ 2, పొలార్డ్‌ 10, డానియల్ సామ్స్ 6* పరుగులు చేశారు. రాజస్తాన్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అశ్విన్‌, చాహల్‌, కుల్‌దీప్‌ సేన్‌ చెరో వికెట్‌ తీశారు.(IPL2022 Mumbai vs Rajasthan)

Virat Kohli First Fifty : ఎట్టకేలకు.. విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్ రాయల్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి 19.2 ఓవర్లలో 159 పరుగులు చేసి గెలిచింది. కాగా, శనివారం(ఏప్రిల్ 30) ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టిన రోజు. రాజస్తాన్ పై గెలిచి బర్త్‌డే బాయ్‌కు ముంబై ఆటగాళ్లు గిఫ్ట్‌గా ఇచ్చారు.


ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన సంజూసేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై ముందు 159 పరుగుల మోస్తరు టార్గెట్ నిర్దేశించింది.

రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్‌ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. బట్లర్‌ (67) మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 4 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆఖర్లో అశ్విన్‌ (21) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్‌, మెరెడిత్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కుమార్ కార్తికేయ, డేనియల్‌ సామ్స్‌ తలో వికెట్‌ తీశారు.

రాజస్తాన్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ ఈ సీజన్ లో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే చాలా నెమ్మదిగా (48 బంతుల్లో) అర్థ శతకం సాధించడం విశేషం. ప్రస్తుత సీజన్‌లో బట్లర్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఈ సీజన్ లో వరుసగా ఎనిమిది మ్యాచులు ఓడిన జట్టుగా రికార్డు సృష్టించిన ముంబై 9వ మ్యాచ్ లో తొలి గెలుపు రుచి చూసింది.

Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ : ఇషాన్‌ కిషన్‌, రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్‌ డేవిడ్, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, కీరన్‌ పొలార్డ్, హృతిక్ షోకీన్‌, డానియల్ సామ్స్, బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్.

రాజస్తాన్‌ రాయల్స్ : జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, సంజూ శాంసన్‌ (కెప్టెన్), డారిల్ మిచెల్, షిమ్రోన్ హెట్‌ మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్‌ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ సేన్.