Lahari Shari : ఖరీదైన BMW బైక్ కొనుగోలు చేసిన బిగ్‌బాస్ భామ

బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఇల్లు, కార్లు ఇలా ఏవో ఒకటి కొనుక్కుంటారు. తాజాగా లహరి షారి కూడా ఓ ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. ఈ భామ బైక్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తుంది.....

Lahari Shari :  ఖరీదైన BMW బైక్ కొనుగోలు చేసిన బిగ్‌బాస్ భామ

Lahari Shari

Lahari Shari :  బిగ్‌బాస్ కు వెళ్లొచ్చిన సెలబ్రిటీలు బాగా ఫేమస్ తెచ్చుకొని వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. ఇక అంతకుముందు కంటే బిగ్ బాస్ వెళ్లొచ్చాక డబ్బులు కూడా బాగానే సంపాదిస్తారు. బిగ్‌బాస్‌ సీజన్‌-5లో లేడీ అర్జున్‌రెడ్డిగా ఫేమస్ అయిన బ్యూటీ లహరి షారి. బిగ్ బాస్ రాకముందు కొన్ని సినిమాల్లో నటించినా ఈ భామకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్‌ షోతో ఫాలోయింగ్‌ బాగా పెరిగింది.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళు ఇల్లు, కార్లు ఇలా ఏవో ఒకటి కొనుక్కుంటారు. తాజాగా లహరి షారి కూడా ఓ ఖరీదైన బైక్ ని కొనుగోలు చేసింది. ఈ భామ బైక్ డ్రైవింగ్ కూడా బాగా చేస్తుంది. దీంతో ఓ లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

Mahesh Babu : ప్రేమికుల దినోత్సవం రోజు ‘సర్కారు వారి పాట’ నుంచి ఫస్ట్ సాంగ్

BMW G 310 GS మోడల్‌కి చెందిన బైక్ ని కొన్న లహరి ”మొత్తానికి ఈ బైక్‌ కొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నా బైక్‌ సౌండ్‌ చాలా నచ్చింది” అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ బైక్ కొన్నందుకు పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు కూడా లహరి కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియ చేస్తున్నారు. ఈ బైక్‌ ధర సుమారు రూ.3 లక్షలకు పైగా ఉంటుంది అని సమాచారం.

View this post on Instagram

A post shared by Lahari Shari (@lahari_shari)