Lara Dutta : డేటింగ్‌ యాప్‌లో మాజీ మిస్‌ యూనివర్స్‌ ప్రోఫైల్‌

టీవల చాలా ఫేక్ డేటింగ్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇందులో సోషల్ మీడియా నుంచి తీసుకున్న అమ్మాయిల, అబ్బాయిల ఫోటోలని పెట్టి మోసాలకు కూడా పాల్పడుతున్నారు. అప్పుడప్పుడు సెలబ్రిటీల ఫోటోలు కూడ

Lara Dutta : డేటింగ్‌ యాప్‌లో మాజీ మిస్‌ యూనివర్స్‌ ప్రోఫైల్‌

Lara

Lara Dutta :  ఇటీవల చాలా ఫేక్ డేటింగ్ యాప్స్ పుట్టుకొచ్చాయి. ఇందులో సోషల్ మీడియా నుంచి తీసుకున్న అమ్మాయిల, అబ్బాయిల ఫోటోలని పెట్టి మోసాలకు కూడా పాల్పడుతున్నారు. అప్పుడప్పుడు సెలబ్రిటీల ఫోటోలు కూడా ఈ డేటింగ్ యాప్స్ వాడేస్తున్నాయి. తాజాగా ఓ డేటింగ్ యాప్ ఏకంగా మాజీ మిస్ యూనివర్స్ ప్రొఫైల్ నే పెట్టింది.

Puneeth Rajkumar : పునీత్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాల : గాలి జనార్దనరెడ్డి

మాజీ మిస్‌ యూనివర్స్‌, నటి, టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి భార్య లారా దత్తాకు చెందిన ప్రోఫైల్ ఓ డేటింగ్ యాప్‌లో ఉంచారు. దీనిపై సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో ఈ విషయం లారా దృష్టికి వెళ్ళింది. లారా ఈ విషయంపై స్పందిస్తూ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది.

Bigg Boss 5: బిగ్ బాస్ నుంచి జెస్సి అవుట్.. షాక్ లో షన్ను, సిరి

ఈ విషయం పై లారా మాట్లాడుతూ.. నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏ డేటింగ్ సైట్లోనూ లేను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం జరిగుతుంది. అందుకే దీనికి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. డేటింగ్ యాప్‌లో నా ప్రొఫైల్ ఉందని చాలా మంది అంటున్నారు. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపైనా చాలా మంది నాకు ఫోన్ చేశారు. వాళ్లందరికీ ఒక్కొక్కరికి క్లారిటీ ఇస్తూ వస్తున్నా కానీ చివరకు ఇలా ఆన్ లైన్ ద్వారా అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నాను. డేటింగ్ యాప్స్‌కి నేను వ్యతిరేకం కాదు, జనాలు ఒకరినొకరు కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ఈ యాప్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పటి వరకు నేను ఏ డేటింగ్ యాప్‌లోనూ లేను. ఇలాంటి వార్తలను నమ్మొద్దు అని తెలిపింది.