Leopard attacks : నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి

ఫామ్ హౌస్ ఆవరణలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ముర్బాద్‌లోని ఫామ్‌హౌస్ ప్రాంగణంలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసి చంపేసింది....

Leopard attacks : నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి

Leopard attacks sleeping pet dog

Updated On : August 7, 2023 / 11:11 AM IST

Leopard attacks sleeping pet dog : ఫామ్ హౌస్ ఆవరణలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై ఒక్కసారిగా చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ముర్బాద్‌లోని ఫామ్‌హౌస్ ప్రాంగణంలో నిద్రిస్తున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. (attacks sleeping pet dog) గురువారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటన గ్రామస్థులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. (Leopard sneaks into Maharashtra farmhouse)

Rahul Gandhi : రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ

పెంపుడు కుక్క ఫామ్‌హౌస్ ప్రాంగణంలో నిద్రపోతుండగా చిరుతపులి ఆవరణలోకి వచ్చి ఒక్క ఉదుటున దాడి చేసింది. కుక్క మెడను నోట కరచుకోవడంతో అది కాస్తా చనిపోయింది. కుక్కపై చిరుతపులి దాడి ఘటన ఫామ్ హౌస్ లోని సీసీ టీవీలో రికార్డు అయింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే ఆ ప్రాంతంలో చిరుతపులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు చిరుతపులి కోసం గాలింపు చేపట్టారు.