Liger: ముంబైలో లైగర్ ఫీవర్.. మామూలుగా లేదుగా!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ కూడా లైగర్ మేనియాతో ఊగిపోతుంది. తాజాగా ముంబైలోని SGC Mallలో లైగర్ టీమ్ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ లైగర్ టీమ్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది.

Liger: ముంబైలో లైగర్ ఫీవర్.. మామూలుగా లేదుగా!

Liger: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా చిత్ర యూనిట్ తీర్చిదిద్దింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తోంది లైగర్ టీమ్.

Liger : అనన్య ఒళ్ళో విజయ్ దేవరకొండ.. ఇదేం ప్రమోషన్స్ బాబు..

ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక బాలీవుడ్ కూడా లైగర్ మేనియాతో ఊగిపోతుంది. తాజాగా ముంబైలోని SGC Mallలో లైగర్ టీమ్ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ లైగర్ టీమ్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. ప్రేక్షకులు లైగర్ టీమ్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చారు. అక్కడవారిలో కనిపించిన ఎగ్జైట్మెంట్, ఎనర్జీతో మాల్ మొత్తం ఊగిపోయింది.

Liger: డిజిటల్, శాటిలైట్ రైట్స్.. లైగర్ పవర్ మామూలుగా లేదుగా..?

దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో బాక్సర్ పాత్రలో విజయ్ దేవరకొండ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు సిద్ధం కాగా, అతడితో ఘాటైన రొమాన్స్ చేయనుంది బాలీవుడ్ భామ అనన్యా పాండే. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను అపూర్వ మెహతా, కరణ్ జోహర్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాధ్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.