Liger : అనన్య ఒళ్ళో విజయ్ దేవరకొండ.. ఇదేం ప్రమోషన్స్ బాబు..

తాజాగా శుక్రవారం లైగర్ నుంచి వాట్ లగా దెంగే.. పాట రిలీజ్ అయింది. ఈ పాటతో సరికొత్త ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్. విజయ్, అనన్య కలిసి ముంబై లోకల్ ట్రైన్‌లో సందడి చేశారు. లోకల్ ట్రైన్ లో ఉన్న జనాలతో.......

Liger : అనన్య ఒళ్ళో విజయ్ దేవరకొండ.. ఇదేం ప్రమోషన్స్ బాబు..

Vijay Devarakonda (1)

Vijay Devarakonda :  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా లైగర్. కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా విజయ్ కిక్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఇందులో స్పెషల్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది. లైగర్ సినిమాని ఆగస్టు 25న విడుదల చేయనున్నారు. దీంతో ఇటీవలే ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Allu Arjun : ఐకాన్ స్టార్ మరో మాస్ లుక్.. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం..

తాజాగా శుక్రవారం లైగర్ నుంచి వాట్ లగా దెంగే.. పాట రిలీజ్ అయింది. ఈ పాటతో సరికొత్త ప్రమోషన్స్ చేశారు చిత్ర యూనిట్. విజయ్, అనన్య కలిసి ముంబై లోకల్ ట్రైన్‌లో సందడి చేశారు. లోకల్ ట్రైన్ లో ఉన్న జనాలతో కాసేపు ముచ్చటించి, ట్రైన్ లో స్టెప్పులు వేశారు. ఆ తర్వాత విజయ్ కాసేపు అనన్య ఒళ్ళో పడుకొని సేద తీరాడు. దీంతో ఈ వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇది కావాలనే చేసిందని, సినిమా ప్రమోషన్స్ కోసం, వైరల్ అవ్వడం కోసం ఇలా చేస్తారేంటి? ఒళ్ళో పడుకొని మరీ ఫొటోలకి ఫోజులివ్వలా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్ లాంచ్ కి కూడా బైక్ ర్యాలీ, డబ్బులిచ్చి డప్పులు, వేషాలు వేసేవాళ్ళు, కటౌట్స్ పెట్టించడంతో ఇదేం కొత్త రకం ప్రమోషన్స్ బాబు అని విజయ్ ని అంటున్నారు జనాలు. ఏది ఏమైనా విజయ్ ఈ సినిమాతో భారీ హిట్ కొట్టడానికి చూస్తున్నాడు. అందుకు తగ్గట్టు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడు.