Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు

Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

Bihar

Lightning Strikes: బీహార్ రాష్ట్రంలో వర్షాకాలం ఆరంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం నితీష్ కుమార్..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, పిడుగుల ధాటికి 16 జిల్లాల్లో 33 మంది మృత్యు వాత పడడంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన నితీష్ కుమార్..మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని..వరదలపై స్థానిక జిల్లా యంత్రాంగం..విపత్తు నిర్వహణశాఖ అధికారులు..సూచనలు పాటించాలని సీఎం నితీష్ కుమార్ సూచించారు.

ఇక బీహార్ లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి చెందడంపై స్పందించిన ప్రధాని మోదీ..మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “మృతుల కుటుంబాలకు ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, స్థానిక పరిపాలన యంత్రాంగం, సహాయ బృందాలు రక్షణ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా.. ఏటా జూన్ రెండో వారం నుంచి బీహార్ లో వర్షాకాలం ప్రారంభం అవుతుండగా..ఈ ఏడాది రెండు వారాల ముందుగానే ప్రారంభం అయింది. వాయువ్య బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బీహార్ లో వర్షాలు కురుస్తున్నాయి.

Other Stories: Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు