Lockdown 3.0 : తెలంగాణ, ఏపీలో ఆన్ లైన్ లో మద్యం ?

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 05:35 AM IST
Lockdown 3.0 : తెలంగాణ, ఏపీలో ఆన్ లైన్ లో మద్యం ?

మద్యం షాపుల దగ్గర తెలుగు రాష్ట్రాల్లోనూ భౌతికదూరం అమలు కావడం లేదు. మందుబాబులు మద్యం కోసం భారీగా వైన్‌షాపులకు తరలివస్తున్నారు. దీంతో వారిని కంట్రోల్‌ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మద్యం కోసం ఎగబడుతున్నారు. చాలా చోట్ల భౌతికదూరం అమలు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కరోనా కేసులు పెరిగే ముప్పు కూడా పొంచి ఉందని భయపడుతున్నారు. 

కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 2020, మే 17 వరకు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఈ క్రమంలో..వైన్ షాపులు మూతపడ్డాయి. మూడోదశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. వీటిలో మద్యం విక్రయాలు కూడా ఉన్నాయి. మద్యం దుకాణాలు ఓపెన్‌ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. దేశ వ్యాప్తంగా వైన్‌షాపులు తెరుచుకున్నాయి. దాదాపు 45 రోజులపాటు మద్యానికి దూరంగా ఉన్న మందుబాబులు… ఒక్కసారిగా వైన్‌షాపుల ముందు బారులు తీరారు. 

భౌతికదూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా అవి అమలు కావడం లేదు. కొన్నిషాపుల దగ్గర మందుబాబులు కిక్కిరిసిపోయారు. కిలోమీటర్ల దూరం క్యూలు కట్టారు. వారిని కంట్రోల్‌ చేయడం ఖాకీలకు కూడా సాధ్యంకావడం లేదు. దీంతో సోషల్‌ డిస్టెన్స్‌ అమలు అన్నది కష్టతరంగా మారింది. ముంబైలో వైన్‌షాపుల ఎదుట రద్దీ ఎక్కువగా ఉండటంతో.. కేవలం రెండు రోజుల్లోనే మద్యం షాపులను మళ్లీ మూసివేశారు.  దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు సూచించినట్టుగా మద్యాన్ని ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తే కరోనా కట్టడి చేయవచ్చు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, పంజాబ్‌‌ రాష్ట్రాల్లో మద్యాన్ని హోమ్‌ డెలివరీ ద్వారా వినియోగదారులకు అందజేస్తున్నారు.సుప్రీం కోర్టు ఉత్తర్వులతో అన్ని రాష్ట్రాలు మద్యం హోమ్‌డెలివరీపై కసరత్తు చేస్తున్నాయి.

Read More :

తొలి రోజు మద్యం అమ్మకాలు… 70 కోట్ల మేర లిక్కర్ తాగేశారంట

ఏపీ ఖజానాకు లిక్కర్ కిక్కు, మద్యం విక్రయాలతో రూ.30వేల కోట్ల ఆదాయం