తొలి రోజు మద్యం అమ్మకాలు… 70 కోట్ల మేర లిక్కర్ తాగేశారంట

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 04:25 PM IST
తొలి రోజు మద్యం అమ్మకాలు… 70 కోట్ల మేర లిక్కర్ తాగేశారంట

తెలంగాణలో తొలి రోజు మద్యం అమ్మకాలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల నుంచి సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు డిపోల నుంచి రూ.44 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఫైనల్ గా రూ.70 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు లక్ష బీర్ల అమ్మకాలు జరిగినట్లు సమాచారం. 

44 రోజుల తర్వాత ఇవాళ మద్యం దుకాణాలు ప్రారంభం కావడంతో భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. దీంట్లో ఇవాళ ఒక్క రోజులోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. 

మార్చి 21న మందు షాపుల వద్ద రూ.110 కోట్ల మద్యం నిలువ ఉంది. దీని తర్వాత ఇవాళ మద్యం డిపోల నుంచి రూ.44 కోట్ల అమ్మకాలు జరిగినట్లు బేవరేజ్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఈ ఒక్కరోజే వివిధం మద్యం షాపుల నుంచి రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో మొత్తంగా సుమారు రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన లెక్కలు తెలుపనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరిగాయి. 

తెలంగాణలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020) ఉదయం 10గంటలకు మద్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజుల తర్వాత వైన్స్‌ షాపులు తెరుచుకోవడంతో.. మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. బుధవారం ఉదయాన్నే మద్యం షాపుల దగ్గరికి చేరుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ లో నిల్చున్నారు. 

రాష్ట్రంలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్‌ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్‌ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కాగా, తెలంగాణలోనూ మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, ఇతర బ్రాండ్ల 16 శాతం ధర పెంచింది. ఈ ప్రకారం కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. 

తెలంగాణ అంతటా లిక్కర్ కోసం మందు బాబులు పోటీ పడుతుంటే నల్గొండ జిల్లాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకరిద్దరు కొనుగోలు దారులు తప్ప జిల్లాలో చాలా మద్యం దుకాణాలు బోసిపోయి కనిపించాయి. కొద్దిపాటి దుకాణాల వద్ద జనాలు అరకొరగా ఉన్నారు. కొద్దిపాటి మంది భౌతిక దూరం పాటిస్తూ పద్ధతిగా మద్యం కొనుగోలు చేశారు. దాదాపు మద్యం దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి.