Lokesh Kanagaraj : ఖైదీ, మాస్టర్, విక్రమ్….. వాట్స్ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్??

భారీ మల్టీస్టారర్ సినిమాగా విక్రమ్ ను లోకేష్ కనగరాజ్ ఢీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు, ఫిలిం మేకర్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ యంగ్ డైరెక్టర్ చేసినవి........

Lokesh Kanagaraj : ఖైదీ, మాస్టర్, విక్రమ్….. వాట్స్ నెక్స్ట్ లోకేష్ కనగరాజ్??

Lokesh

Lokesh Kanagaraj :  ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినీ ఆడియన్స్ చర్చంతా విక్రమ్ సినిమా గురించే. భారీ మల్టీస్టారర్ సినిమాగా విక్రమ్ ను లోకేష్ కనగరాజ్ ఢీల్ చేసిన విధానం ఇప్పుడు ఆడియన్స్ నే కాదు, ఫిలిం మేకర్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ యంగ్ డైరెక్టర్ చేసినవి నాలుగు సినిమాలే అందులో ఖైది, మాస్టర్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. దాంతో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే విక్రమ్ సినిమాలో విక్రమ్ 2, లేదా ఖైదీ 2 ఉండొచ్చు అని లీడ్ ఇచ్చి వదిలేశాడు. విక్రమ్ సక్సెస్ తర్వాత మాగ్జిమమ్ ఆడియన్స్ ఆ జోష్ లో లోకేష్ కనగరాజ్ విక్రమ్ 2 లేదా ఖైదీ2 చేస్తారని అనుకుంటున్నారు. విక్రమ్ సినిమా క్లయిమాక్స్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే సీక్వెల్ పై హింట్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. ఇక రీసెంట్ గా కమలహాసన్ కూడా స్వయంగా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, అందులో రోలెక్స్ క్యారెక్టర్ చేసిన సూర్యకి ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటుందన్నారు. లోకేష్ మాత్రం ఖైదీ తర్వాత మాస్టర్ ఛాన్స్ ఇచ్చిన తమిళ స్టార్ తళపతి విజయ్ 67వ సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నమయ్యారు.

ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయిపోయిన వెంటనే లోకేష్ కనగరాజ్ తో రెగ్యులర్ షూట్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. విజయ్ 67వ సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ అనిరుధ్ ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో కోసం మ్యూజిక్ రెడీ చేశారని సమాచారం. విజయ్ 67వ సినిమా అనౌన్స్మెంట్ కోసం సాలిడ్ ప్లాన్ తో ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే విజయ్ 67వ సినిమా టైటిల్ అనౌన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

 

Nagarjuna : రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్‌లో 10వ సినిమా.. మళ్ళీ ఆధ్యాత్మికంగా??

ఒక రేంజ్ హైప్ తో రిలీజ్ అయిన బీస్ట్ విజయ్ కెరీర్ లో ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. అంతగా భారీ అంచనాలు లేకుండా రిలీజ్ అయిన విక్రమ్ ఓ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటి వరకు నాలుగంటే నాలుగే సినిమాలు చేసి, గ్రాడ్యుయల్ గా సక్సెస్ రేట్ పెంచుకుంటూ పోతున్నాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం విక్రమ్ తో ఆయన కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి పేరొచ్చింది. విజయ్ 67వ సినిమాతో సౌత్ ఇండియా క్రేజీ హీరో విజయ్ ని కూడా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్తాడని విజయ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అలాగే లోకేష్ కనగరాజ్ కి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చారని సమాచారం. రామ్ చరణ్ తో లోకేష్ సినిమా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఒక వేళ ఈ సినిమా ఉంటే విజయ్ సినిమా తర్వాత విక్రమ్ కి సీక్వెల్ తీసిన తర్వాతే ఉంటుందని సమాచారం.