MANOJ PANDEY: కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ MANOJ PANDEY నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు.

MANOJ PANDEY: కొత్త ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే

Manoj Pandey

ARMY CHIEF: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ పాండే నియామకం కానున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్న జనరల్ ఎమ్ఎమ్ నరవాణే ఈ నెలాఖరున రిటైర్ కానున్నారు. దీంతో నరవాణే స్థానంలో, ఏప్రిల్ 30న మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంజనీర్ల విభాగం నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న మొదటి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే కావడం విశేషం. ఆర్మీలో నరవాణే తరువాత ఉన్న సీనియర్ ఆఫీసర్లలో మనోజ్ పాండే ఒకరు. మరోవైపు జనరల్ నరవాణే.. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) రేసులో ముందు వరుసలో ఉన్నారు.

Indian Army : ఇండియన్ ఆర్మీ వెస్టర్న్ కమాండ్ లో పోస్టుల భర్తీ

నరవాణే రిటైర్మెంట్ తర్వాత సీడీఎస్ పదవి దక్కే అవకాశం ఉంది. ఇంతకుముందు ఈ స్థానంలో జనరల్ బిపిన్ రావత్ ఉండేవారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆయన మరణం తర్వాత నుంచి ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. ఈ నేపథ్యంలో సీడీఎస్ పదవి కోసం నరవాణే పేరును కూడా కేంద్రం పరిశీలిస్తోంది. సీడీఎస్ అంటే త్రివిధ దళాలకు నాయకుడిగా ఉంటారు. సీడీఎస్ ఎంపిక కూడా త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. మనోజ్ పాండే 1982లో సైన్యంలోని ఇంజనీర్ల విభాగంలో చేరారు. ఇథియోపియాలో ఐరాస తరఫున చీఫ్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు.