Road Stolen: మా ఊర్లో కిలోమీటరు రోడ్డు మాయం అయిపోయింది సార్..వెతికిపెట్టిండీ..పోలీసులకు ఫిర్యాదు

‘సార్ మా ఊర్లో కిలోమీటరు దూరం ఉండే రోడ్డు మాయం అయిపోయింది సార్..దయచేసి వెతికిపెట్టండీ అంటూ ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.తాము వినేది నిజమా కాదా? అని మరోసారి అడిగారు. దానికి గ్రామస్తులు మరోసారి ‘మీరు విన్నది నిజమే సార్..ఒక కిలోమీటర్ మేర రహదారి రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది సార్..’ అని చెప్పారు.

Road Stolen: మా ఊర్లో కిలోమీటరు రోడ్డు మాయం అయిపోయింది సార్..వెతికిపెట్టిండీ..పోలీసులకు ఫిర్యాదు

Road Stolen Overnight Poloce Complaint

Road Stolen Overnight poloce Complaint : ఎవరైనా మా ఇంట్లో దొంగలు పడి దోచుకుపోయారనో..బంగారం పోయిందనో..ఫోన్ పోయిందనో పోలీసులకు ఫిర్యాదులు చేయటం గురించి విన్నాం. కానీ మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీసులకు విచిత్రమైన కంప్లైంట్ ఇచ్చారు. ‘సార్ మా ఊర్లో కిలోమీటరు దూరం ఉండే రోడ్డు పోయింది సార్..దయచేసి వెతికిపెట్టండీ అంటూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు షాక్ అయ్యారు.తాము వినేది నిజమా కాదా? అని మరోసారి అడిగారు. దానికి గ్రామస్తులు మరోసారి ‘మీరు విన్నది నిజమే సార్..ఒక కిలోమీటర్ మేర రహదారి రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది సార్..’ అని చెప్పారు. సిధి జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన మేంద్రా గ్రామస్తులు పోలీసులకు చేసిన ఫిర్యాదు ఇది.

అదేంటీ రోడ్డు ఎలా పోతుంది? అనే డౌట్ రాదు గానీ..ఈ ఫిర్యాదులో ఏదో విషయం ఉండే ఉంటుందనుకుంటున్నారు కదూ..నిజమే..తమ గ్రామానికి రోడ్డు వేయించుకోవటానికి నిధులు దుర్వినియోగంతో విసిగిపోయిన గ్రామస్థులు కిలోమీటర్ మేర రోడ్డు మాయమైందని.. వెతికి తీసుకురావాలంటూ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు.అంతేకాదు పంచాయతీ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల కంప్లైంట్ తో పోలీసులు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. తరువాత ఉన్నతాధికారులకు అదే విషయాన్ని చేరవేశారు. సమాచారమిచ్చారు. మధ్యప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన సిధి జిల్లాలోని మంజోలి జనపద్ పంచాయతీ పరిధిలోని మేంద్ర గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామంగా పేరొందింది. కనీసం రోడ్డు వేయించుకునే దిక్కుకూడా లేకపోయింది. దీని కోసం అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితంలేదు. రోడ్డు వేసిన అవి నాసికరంగా ఉండటంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. పైగా వర్షాకాలం వచ్చిందంటే ఇక నరకమే. అడుగు బయటపెట్టాలంటే మట్టి..బురద. దీంతో గ్రామస్తులు విసిగిపోయారు.

దీంతో గ్రామానికి చెందిన డిప్యూటీ సర్పంచ్ స్థానికులతో కలిసి మంజోలి పోలీస్ స్టేషన్‌ లో వినూత్న కంప్లైంట్ ఇచ్చారు. ‘‘రాత్రి రోడ్డు బాగానే ఉంది సార్..కానీ తెల్లవారే సరికి మాయమైపోయింది.. ప్రస్తుతం ఉన్న రోడ్డు తమ ఊరుది కాదు..దయచేసి మా రోడ్డును మాకు వెతికి తెప్పించండీ సార్’ అంటూ ఫిర్యాదు చేశారు.

కాగా..మేంద్రా గ్రామంలో రూ.10 లక్షల నిధులు ఖర్చుపెట్టి రోడ్డును నిర్మించారు. కానీ చిన్నపాటి వర్షాలకే రోడ్డు పాడైపోయింది. అస్సలు అక్కడ రోడ్డు వేసిన దాఖలాలే కనిపించకుండాపోయాయి. మొత్తం బురద బురద మారడంతో ఆగ్రహించిన సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్థులు.. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్‌ను సంప్రదించారు. కాంట్రాక్టర్ లో ఏమాత్రం స్పందన లేదు. నన్నేం చేయమంటారు? అంటూ ఎదురు ప్రశ్నించటంతో గ్రామస్థులు రోడ్డు పోయిందంటూ పోలీసుల దగ్గరికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణ అనంతరం నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటామని సిధి జిల్లా అధికారులు చెబుతున్నారు.