Panna Diamond Mine 13.54 carats : పన్నా వజ్రాల గనుల్లో.. గిరిజన కూలీకి దొరికిన 60 లక్షల విలువైన వజ్రం

పన్నా వజ్రాల గనుల్లో.. గిరిజన కూలీకి 60 లక్షల విలువైన వజ్రం దొరికింది.

Panna Diamond Mine 13.54 carats : పన్నా వజ్రాల గనుల్లో.. గిరిజన కూలీకి దొరికిన 60 లక్షల విలువైన వజ్రం

Panna Mine 13.54 Carats Diamond

Panna mine 13.54 carats Diamond : రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే ఓ కూలిని అదృష్టం వరించింది. ఓ 13 క్యారెట్ల రూపంలో అదృష్టదేవత వరించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల్లో వజ్రాల కోసం వెదుకుతుండగా ఓ గిరిజన కూలీకి ఏకంగా రూ.60లక్షల విలువైన ఓ వజ్రం దొరికింది. దీంతో అతని ఆనందానికి అంతేలేదు. పన్నా వజ్రాల గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవుతుంటారు. కష్టానికి తోడు అదృష్టం కూడా వరిస్తే కూలీల కష్టం తీరిపోతుంది. అలా మరో కూలీని అదృష్టం వరించింది.

Read more : గనిలో దొరికిన 341 క్యారెట్ల వజ్రం..ధర రూ.110 కోట్లు..!!

ములాయం సింగ్‌ అనే గిరిజనుడు కాయకష్టం చేసి జీవిస్తుంటాడు. కూలీకి వెళితేనే ఆ కుటుంబానికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళతాయి. ప్రతీరోజు జీవితంతో పోరాటం చేయాల్సిందే. తన పిల్లలను చదివించుకోవాలన్నా..వారి కడుపులు నింపాలన్నా కష్టపడాల్సిందే. అటువంటి ములాయం సింగ్ కు పన్నా వజ్రాల గనుల్లో గత బుధవారం ఓ వజ్రం దొరికింది. ఆ వజ్రం 13 క్యారెట్ల బరువు ఉండగా దాని విలువ రూ.60లు ఉంటుందని అంచనా.

Read more : Whats App : భారత్‌లో 20 లక్షల 69 వేల వాట్సప్ అకౌంట్లపై నిషేధం…ఆ 8 కారణాలివే

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా వజ్రాల గనులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. వీటిల్లోని నిస్సార గనిలో రూ. 60 లక్షల విలువైన 13 క్యారెట్ల వజ్రం లభించడంతో ములాయం సింగ్ అదృష్టం మారిపోయింది. బుధవారం తెలిపారు. “ములాయంకు దొరికిన ఆ వజ్రం 13.54 క్యారెట్‌ల బరువుంది. అధికారులు దాని విలువను రూ.60 లక్షలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు. ములాయం సింగ్‌తో పాటు..మరికొందరు వజ్రాల కోసం వెతికేవారిలో మరికొంతమందికి వేర్వేరు బరువుల ఆరు వజ్రాలు లభించాయని తెలిపారు.