WhatsApp : భారత్‌లో 20 లక్షల 69 వేల వాట్సప్ అకౌంట్లపై నిషేధం…ఆ 8 కారణాలివే

2021 అక్టోబర్ లో భారతదేశానికి చెందిన 20లక్షల 69 వేల ఎకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ గతంలో బ్యాన్ చేసిన ఎకౌంట్ల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది.

WhatsApp : భారత్‌లో 20 లక్షల 69 వేల వాట్సప్ అకౌంట్లపై నిషేధం…ఆ 8 కారణాలివే

Whats App

WhatsApp :  సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను ఈ రోజు కొట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా యాప్‌లలో వాట్సప్ కున్న డిమాండ్ అలాంటిది. రోజులో ఒకటి,రెండు గంటల పాటు వాట్సప్ ఆగిపోయిందటే ప్రాణం పోయినట్లు గిలగిలలాడిపోతారు వినియోగదారులు. ప్రజలకు వాట్సప్ అంతగా కనెక్టయ్యింది.

2021 అక్టోబర్ లో భారతదేశానికి చెందిన 20లక్షల 69 వేల ఎకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ గతంలో బ్యాన్ చేసిన ఎకౌంట్ల సంఖ్య రెండు కోట్లు దాటిపోయింది. అందులో భారత్ కు చెందిన వారివి సుమారు 30.27 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో అమలులోకి వచ్చిన కొత్త ఐటీ చట్టం, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్‌లోని నియామాల ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వాట్సప్ స్పష్టం చేసింది.

Also Read : Tiruppavai : డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

వాట్సప్ యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని ఎకౌంట్లను నిషేధించినట్లు తెలిపింది. అయితే వాట్సప్ మెసేజ్‌లు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ ద్వారా సేఫ్టీగా ఉన్నప్పటికీ ఖాతాలను వాట్సప్ సిబ్బంది ట్రాక్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాట్సప్ యూజర్లు తమ రూల్స్‌ను అతిక్రమించినట్లు కనిపిస్తే వాటిని నిషేధిస్తామని వాట్సప్ స్పష్టంగా చెప్పింది. వాట్సప్ సర్వీసు నిబంధనల ప్రకారం ఈ 8 చర్యలు చేయటం వలన వాట్సప్ ఖాతాలు బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది.

మరొకరి పేరుతో నకిలీ ఖాతా సృష్టించటం….
వాట్సప్‌లో కొంతమంది మరోకరి పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.ఇలా చేసిన వారి ఖాతాలను గుర్తించి వాట్సప్ బ్యాన్ చేస్తుంది.

కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు ఎక్కువ మెసేజ్ లు పంపడం…
మీ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తులకు ఎక్కువ మేసేజ్ లు పంపించటం వల్ల కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులను స్పామ్ చేస్తే వాట్సప్ మీఖాతాను నిషేధిస్తుంది. అంతే కాద బల్క్ మేసేజింగ్, ఆటో-మెసేజింగ్, ఆటో డయలింగ్ వంటివి చేస్తే నిషేధించటానికి వాట్సప్ చర్యలు తీసుకుంటుంది.

వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్, వాట్సాప్ ప్లస్ వంచి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించటం
కొంతమంది ప్లే స్టోర్ లో ఉన్నథర్డ్ పార్టీ వాట్సప్ యాప్ లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్స్ ద్వారా ఇతరుల వాట్సప్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వారి చాటింగ్ హిస్టరీని తెలుసుకుంటూ ఉంటారు. ఇది ఆయా ఖాతాదారుల వ్యక్తిగత గోప్యతకు వ్యతిరేకం. కాబట్టి అలాంటి ఎకౌంట్లను వాట్సప్ నిషేధిస్తుంది.

ఎక్కువ మంది యూజర్లు మిమల్ని బ్లాక్ చేస్తే ..
వివిధ కారణాలతో మీ స్నేహితులు లేదా తెలిసిన వారు మీ ఎకౌంట్ ను బ్లాక్ చేస్తుంటారు. అయితే ఈ రకంగా ఎక్కవ మంది మిమ్మల్ని బ్లాక్ చేస్తే.. అలా బ్లాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్నారా లేరా అనికూడా చూడకుండా వాట్సప్ మీ ఖాతాను బ్యాన్ చేస్తుంది.

మీ వాట్సప్ ఖాతాపై ఎవరైనా ఫిర్యాదు చేయటం..
మీ వాట్సప్ ఖాతాకు వ్యతిరేకంగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీ ఎకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం ఉఁది.

ఇతర యూజర్లకు మాల్ వేర్ లేదా ఫిషింగ్ లింక్ లు పంపించటం వలన…
మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఏపీకే ఫైల్స్ రూపంలో మాల్ వేర్ ను పంపినా.. లేగా ప్రమాద కరమైన ఫిషింగ్ లింక్స్ ను యూజర్లకు ఫార్వర్డ్ చేసినా మీవాట్సప్ ఎకౌంట్ బ్యాను కు గురవుతుంది.

వాట్సప్ లో పోర్న్ క్లిప్పులు, పరువు నష్టం కలిగించే మెసేజ్ లు పంపించడం…
మా వాట్సప్ నుంచి ఇతరులకు చట్టవిరుధ్దమైన, పరువు నష్టం కలిగించే, అశ్లీలమైన, వేధించే, ద్వేషపూరిత మైన మెసేజ్ లుం పంపిస్తే మీ ఎకౌంట్ ను నిషేధించే అవకాశం ఉంది.

వాట్సప్‌లో హింసను  ప్రోత్సహించే మెసేజ్‌లు, వీడియోలు పంపించటం
వాట్సప్ లో హింసను ప్రోత్సహించే ఫేక్ మెసేజ్ లు, వీడియోలు పంపించటం…. నేరాలను ప్రోత్సహించటం… హింసాత్మక వీడియోలను పంపించినా మీ వాట్సప్ ను బ్యాన్ చేసే అవకాశం ఉంది.  కాబట్టి   ప్రతి ఖాతాదారుడు  వాట్సప్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఉంది.