గనిలో దొరికిన 341 క్యారెట్ల వజ్రం..ధర రూ.110 కోట్లు..!!

గనిలో దొరికిన 341 క్యారెట్ల వజ్రం..ధర రూ.110 కోట్లు..!!

eenadu-epaper-eena/cheppulesukunte+lakshallo+jitan-newsid : ఆఫ్రికా అంటే గుర్తుకొచ్చేది కరవు. కానీ వజ్రాలకు ప్రసిద్ది. వజ్రల గనులమీద నడిచే ఆఫ్రియా దేశాలు మాత్రం కరవుతో అల్లాడుతుంటాయి. అటువంటి ఆఫ్రికాలోని ఓ గనిలో 378 క్యారెట్ల అద్భుతమైన వజ్రం లభ్యమైంది. దీని ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. వజ్రం అంటేనే ఖరీదైనది అద్భుతమైనవీను..అటువంటిది ఏకంగా 378 క్యారెట్ల వజ్రం అంటే..ఖరీదు ఊహకు కూడా అందనిదే..

సాధారణంగా 1, 2 క్యారెట్ల వెయిట్ ఉన్న వజ్రాలు లక్షల్లో ఉంటాయి. అటువంటిది 378 క్యారెట్ల వజ్రం అంటే మాటలా..?ఆఫ్రికాలోని బోత్సవానాలో లభ్యమైన 378 క్యారెట్ల డైమండ్ కెనాడాకు చెందిన లుకారా డైమండ్స్​కు చెందిన గనిలో దొరికింది. ఈ వజ్రం అత్యద్భుతంగా ఉందని లుకారా సంస్థ తన ట్విట్టర్ లో వెల్లడించింది. “ఈ అఖండ వజ్రం 2021 జనవరి 15న కనుగొన్నామనీ..ఇది 341 క్యారెట్లు ఉందని తెలిపింది. 200 క్యారెట్ల కన్నా ఎక్కువగా ఉన్న 55వ వజ్రం ఇదేననీ..వెల్లడించింది.

అయితే ఇంత అందమైన వజ్రం ధర 15 మిలియన్ డాలర్ల అంటే మన భారత్ కరెన్సీలో దాదాపు రూ.110కోట్లుపైనే ఉంటుందని వజ్రాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 378 క్యారెట్ల డైమండ్ అనీ..ఈ కొత్త సంవత్సరంలో ఇంత పెద్ద వజ్రం అనీ..300 క్యారెట్లకు పైగా రెండో వజ్రం ఇది. బోత్సవానా అద్భుతమైన వజ్రాల సామర్థ్యంలో ఇదో హైలెట్​. దీన్ని మరింత వెలుగులోకి తీసుకొస్తాం” అని లుకారా సీఈవో ఎలిరా థామస్ తెలిపారు.

ఇప్పటికే మాకు 378, 341 క్యారెట్ల వజ్రాలు దొరికాయి. ఈ కరోనా కష్ట సమయంలో ఇంత పెద్ద వజ్రాలు దొరకటం మా సంస్థను చాలా మేలు జరుగుతుందని తెలిపారు. కరోవేలో సంస్థ ఆర్థికంగా, మౌళిక సదుపాయాల పరంగా మరింత పటిష్టమయ్యేందుకు ఇదో అవకాశమనీ..కనీసం 13 ఏళ్ల పాటు అంటే 2026 వరకు ఇక్కడ గనుల త్వవకాలను చేపట్టాలని అనుకుంటున్నామని తెలిపారు.