Yadadri Temple Samprokshana : రేపే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: ప్రారంభం

యాదాద్రి ప్ర‌ధాన ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి ఆల‌యంలో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ చేయ‌నున్నారు.(Yadadri Temple Samprokshana)

Yadadri Temple Samprokshana : రేపే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: ప్రారంభం

Yadadri Temple Samprokshana

Yadadri Temple Samprokshana : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి స్వయంభు దర్శనాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం(మార్చి 28) నుంచి యాదాద్రి ప్ర‌ధాన ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా యాదాద్రి ఆల‌యంలో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేప‌థ్యంలో యాదాద్రిలో ఏర్పాట్ల‌ను మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ప‌రిశీలించారు. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి బయలుదేరుతారు.

Yadadri Temple : రేపే మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభూ దర్శనం

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కేసీఆర్ దంపతులు యాదాద్రి వెళ్లనున్నారు. ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మహా పర్వం మొదలు కానుంది. మహాకుంభ సంప్రోక్షణలో కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం 12.20 నుండి 12.30 గంటల వరకు స్వామివారి గర్భాలయ దర్శనం ఉంటుంది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ దైవ దర్శనం చేసుకుంటారు.(Yadadri Temple Samprokshana)

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆలయ విస్తరణ నిర్మాణం చేపట్టడంతో ఏడేళ్ల తర్వాత స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కృష్ణశిలలతో ఆలయ నిర్మాణం జరిగింది. అబ్బురపరిచే శిల్పాలతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం మొదలుకానుంది.

Yadagiri Gutta : యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలు

సాయంత్రం 4 గంటల నుంచి భక్తులకు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు కల్పించనున్నారు. దీంతో యాదాద్రిలో ఆధ్మాత్మిక శోభ ఉట్టి పడుతోంది. యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.(Yadadri Temple Samprokshana)

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆలయాన్ని పునర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయం సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇక యాదాద్రిలో నిత్య పూజలు, దర్శన వివరాలను ఈవో కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29వ తేదీ నుంచి అమలు కానున్నట్లు ఈవో కార్యాలయం తెలిపింది. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అనంతరం స్వామి వారికి సుప్రభాత సేవ జరుగనుంది.

తెల్లవారుజామున 3.30 గంటలకు బిందెతీర్థం, ఆరాధన చేయనున్నారు ఆలయ అర్చుకులు.
ఉదయం 4.00 గంటలకు బాలభోగం. ఇది అరగంట పాటు కొనసాగనుంది.
ఉదయం 4.30 గంటకు స్వామి వారికి నిజాభిషేకం చేస్తారు.
ఉదయం 5.30 గంటలకు స్వామి వారిని అలంకరిస్తారు.
ఉదయం 5.45 గంటలకు సహస్రనామార్చన, కుంకుమార్చలను నిర్వహిస్తారు.
ఉదయం 6.30 గంటలకు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తారు.(Yadadri Temple Samprokshana)

ఉదయం 8.00 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
ఉదయం 9.00 గంటలకు సర్వదర్శనం.
మధ్యాహ్నం 12.00 గంటలకు రాజభోగం అంటే ఆరగింపు చేస్తారు. ఈ సమయంలో భక్తులను అనుమతించరు.
మధ్యాహ్నం 12.45 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
సాయంత్రం 4.00 గంటలకు మరోసారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అమలు చేస్తారు